(॥పల్లవి॥)
నీకును నివియే నేరుపులు
కైకొని యీ కాంతఁ గరుణ నేలుమూ
(॥॥)
చనవరి కాంతలు జరసి(?) పలికితే
మనసునఁ బెట్టఁడు మగవాఁడు
పనివడి వలపునఁ బైఁ జేయి వేసిన
వినయముగాఁ గొను వేడుకతోను
(॥॥)
ఆసతోడ సతి ఆయము లంటితే
వేసరఁగ రాదు విభునికిని
వోసరించ కటు వుదుటున నవ్విన
రాసి కెక్క సంతోసము నెరవు
(॥॥)
కడు ననిచిన చెలిఁ గౌఁగిట నించితే
విడు మని యెంచఁడు విభుఁడెపుడూ
బడి నలమేల్మంగపతి శ్రీ వేంకటేశ
ఆడరి యేలితివి ఆ తగ వాయ.
(||pallavi||)
nīgunu niviye nerubulu
kaigŏni yī kāṁtam̐ garuṇa nelumū
(||||)
sanavari kāṁtalu jarasi(?) paligide
manasunam̐ bĕṭṭam̐ḍu magavām̐ḍu
panivaḍi valabunam̐ baim̐ jeyi vesina
vinayamugām̐ gŏnu veḍugadonu
(||||)
āsadoḍa sadi āyamu laṁṭide
vesaram̐ga rādu vibhunigini
vosariṁcha kaḍu vuduḍuna navvina
rāsi kĕkka saṁtosamu nĕravu
(||||)
kaḍu nanisina sĕlim̐ gaum̐giḍa niṁchide
viḍu mani yĕṁcham̐ḍu vibhum̐ḍĕbuḍū
baḍi nalamelmaṁgabadi śhrī veṁkaḍeśha
āḍari yelidivi ā taga vāya.