Neegunu naabegum dagu nemu vinnavimchedemee

నీకును నాపెకుఁ దగు నేము విన్నవించేదేమీ
Language

(॥పల్లవి॥)
నీకును నాపెకుఁ దగు నేము విన్నవించేదేమీ
జోకతోడ నీకె మోము చూచి నవ్వవయ్యా

(॥నీకు॥)
మనసు లెనసినట్టి మాఁట లెవ్వరికైనాను
విన వేడుకేకాని వెగటుగాదు
వనిత నిన్నేమనినా వక్కణ లడుగవద్దు
చనవిచ్చి మెచ్చి మెచ్చి సంతోసించవయ్యా

(॥నీకు॥)
చెల్లుబడియైనట్టి మాఁట లెవ్వరికైనాను
యెల్లవారి కింపేకాని యెరపు కాదు
వొల్లనే గోరనొత్తితే నొడ్డుకో నంతేసి
చెల్లుబడి సేసుకొని చెక్కునొక్కవయ్యా

(॥నీకు॥)
పొందుగలిగినచోట పూఁచి యెంత పెనఁగినా
అందమయ్యే తోఁచుఁగాని అలపుగాదు
చెందె నలమేల్మంగ శ్రీవేంకటేశ నిన్ను
కందువగా మోని యిచ్చి కడు మన్నించవయ్యా

(||pallavi||)
nīgunu nābĕgum̐ dagu nemu vinnaviṁchedemī
jogadoḍa nīgĕ momu sūsi navvavayyā

(||nīgu||)
manasu lĕnasinaṭṭi mām̐ṭa lĕvvarigainānu
vina veḍugegāni vĕgaḍugādu
vanida ninnemaninā vakkaṇa laḍugavaddu
sanavichchi mĕchchi mĕchchi saṁtosiṁchavayyā

(||nīgu||)
sĕllubaḍiyainaṭṭi mām̐ṭa lĕvvarigainānu
yĕllavāri kiṁpegāni yĕrabu kādu
vŏllane goranŏttide nŏḍḍugo naṁtesi
sĕllubaḍi sesugŏni sĕkkunŏkkavayyā

(||nīgu||)
pŏṁdugaliginasoḍa pūm̐si yĕṁta pĕnam̐ginā
aṁdamayye tom̐sum̐gāni alabugādu
sĕṁdĕ nalamelmaṁga śhrīveṁkaḍeśha ninnu
kaṁduvagā moni yichchi kaḍu manniṁchavayyā