నీకుఁ జూడ వినోదాలై నిండుకవున్నవి గాక
(॥పల్లవి॥)
నీకుఁ జూడ వినోదాలై నిండుకవున్నవి గాక
కైకొన్న పతి గుండెలో గాలములు గావా
(॥నీకు॥)
తలఁపులోఁ దగిలి యాతని భ్రమయించేవి నీ
మొలకనవ్వులేకావా ముదిత నేఁడు
చలివాసి రమణుని సారెకుఁ బైకొలిపేవి
పలచని పెదవిపై పలులేకావా
(॥నీకు॥)
ఆయాలుసోఁకి యాతనియాసలు పెడరేఁచేవి
సోయగపునీకనుచూపులేకావా
వాయపుమదములు గొబ్బన నూరఁజేసేవి
చాయల మెఱుఁగుల నీచన్నులేకావా
(॥నీకు॥)
చిందువందుగా మేను చెమరింపజేసేది
కందువరతుల నీకాఁగిలేకాదా
అందపు శ్రీవేంకటేశు నన్నిటానుఁ గూడితివి
సందడించేమీ ఇద్దరిసన్నలేకావా
(||pallavi||)
nīgum̐ jūḍa vinodālai niṁḍugavunnavi gāga
kaigŏnna padi guṁḍĕlo gālamulu gāvā
(||nīgu||)
talam̐pulom̐ dagili yādani bhramayiṁchevi nī
mŏlaganavvulegāvā mudida nem̐ḍu
salivāsi ramaṇuni sārĕgum̐ baigŏlibevi
palasani pĕdavibai palulegāvā
(||nīgu||)
āyālusom̐ki yādaniyāsalu pĕḍarem̐sevi
soyagabunīganusūbulegāvā
vāyabumadamulu gŏbbana nūram̐jesevi
sāyala mĕṟum̐gula nīsannulegāvā
(||nīgu||)
siṁduvaṁdugā menu sĕmariṁpajesedi
kaṁduvaradula nīgām̐gilegādā
aṁdabu śhrīveṁkaḍeśhu nanniḍānum̐ gūḍidivi
saṁdaḍiṁchemī iddarisannalegāvā