Neegum jooda vedugalai nedi kunnavi gaaga

నీకుఁ జూడ వేడుకలై నేటి కున్నవి గాక
Language

(॥పల్లవి॥)
నీకుఁ జూడ వేడుకలై నేటి కున్నవి గాక
దాకొని వెనకకు మరి తలపోఁత గాదా

(॥నీకు॥)
బాసలు సేసి సేసి బయలు యీదించితివి
ఆసల నోరూరించితి వప్పటి నీవు
వాసులెక్కించి మెప్పించి వలలఁ జిక్కించితివి
దోసముగాదా యిట్టె తొయ్యలుల తోడను

(॥నీకు॥)
బెట్టుగా నవ్వి నవ్వి బేరి జోకొట్టితివి
గుట్టున బయకారాలే కుమ్మరించితి
గట్టువాయతనమున గాలి ముడె గట్టితివి
వట్టి యపకీర్తి గద్దా వనితల తోడను

(॥నీకు॥)
నన్నేలి పైడికి వాసనలు వుట్టిపంచితివి
సన్నలనే కొండలు సాదించితివి
అన్నిటా శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
మన్నించుటే మేలుగాదా మగువల తోడను

(||pallavi||)
nīgum̐ jūḍa veḍugalai neḍi kunnavi gāga
dāgŏni vĕnagagu mari talabom̐ta gādā

(||nīgu||)
bāsalu sesi sesi bayalu yīdiṁchidivi
āsala norūriṁchidi vappaḍi nīvu
vāsulĕkkiṁchi mĕppiṁchi valalam̐ jikkiṁchidivi
dosamugādā yiṭṭĕ tŏyyalula toḍanu

(||nīgu||)
bĕṭṭugā navvi navvi beri jogŏṭṭidivi
guṭṭuna bayagārāle kummariṁchidi
gaṭṭuvāyadanamuna gāli muḍĕ gaṭṭidivi
vaṭṭi yabagīrdi gaddā vanidala toḍanu

(||nīgu||)
nanneli paiḍigi vāsanalu vuṭṭibaṁchidivi
sannalane kŏṁḍalu sādiṁchidivi
anniḍā śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
manniṁchuḍe melugādā maguvala toḍanu