Neegum delayadugaaga nee mamchigunaale kaavaa

నీకుఁ దెలయదుగాక నీ మంచిగుణాలే కావా
Language

(॥పల్లవి॥)
నీకుఁ దెలయదుగాక నీ మంచిగుణాలే కావా
పైకొని మమ్మింత చేసి భ్రమయించేవి

(॥॥)
వంచీ నీరెప్పల లోని వాలుక చూపులు గావా
మంచితనమున నామెయి మఱపించేవి
ఇంచుకంత సెలవుల యీనవ్వులే కావా
తుంచి తుంచి ఆయములు తూరిపారేవి

(॥॥)
కొంత కొంత గొణఁగుల కొనమాటలే కావా
చింతతో నా చెక్కిటికిఁ జేయి దెచ్చేవి
పంతపుటలుకలతో పచ్చి వొట్లే కావా
అంతలోనే నన్ను సురనిపించేవి

(॥॥)
కూరిమి నీ వేకతానఁ గూడినరతులే కావా
తారుకాణలై సారెఁ దలఁపించేవి
యీరీతి శ్రీ వేంకటేశ యిద్దరము నున్నారము
సారె నీపొందులేకావా చవులయినవి

(||pallavi||)
nīgum̐ dĕlayadugāga nī maṁchiguṇāle kāvā
paigŏni mammiṁta sesi bhramayiṁchevi

(||||)
vaṁchī nīrĕppala loni vāluga sūbulu gāvā
maṁchidanamuna nāmĕyi maṟabiṁchevi
iṁchugaṁta sĕlavula yīnavvule kāvā
tuṁchi tuṁchi āyamulu tūribārevi

(||||)
kŏṁta kŏṁta gŏṇam̐gula kŏnamāḍale kāvā
siṁtado nā sĕkkiḍigim̐ jeyi dĕchchevi
paṁtabuḍalugalado pachchi vŏṭle kāvā
aṁtalone nannu suranibiṁchevi

(||||)
kūrimi nī vegadānam̐ gūḍinaradule kāvā
tārugāṇalai sārĕm̐ dalam̐piṁchevi
yīrīdi śhrī veṁkaḍeśha yiddaramu nunnāramu
sārĕ nībŏṁdulegāvā savulayinavi