Neegum briyamaina vellaa nemdu naayamdivigo

నీకుఁ బ్రియమైన వెల్లా నేఁడు నాయందివిగో
Language

(॥పల్లవి॥)
నీకుఁ బ్రియమైన వెల్లా నేఁడు నాయందివిగో
పైకొని చేకొనుమీ యౌభళనారసింహా

(॥నీకు॥)
కొండలెక్కి చూచితివి కోరి యౌభళాన నా-
కొండలకుచములె ఇక్కువవో నీకు
అండనే కంబాన నుంటి వలనాఁడు నాతొడలు
నిండునరఁటికంబాలు నీకు నివివో

(॥నీకు॥)
యెత్తితివి రెండురూపు లేకమైనమేను నాఁడు
అత్తిననీనారూపు లటువలెఁబో
చిత్తగించి నవనారసింహములై వుంటి వాడ
మొత్త మినానవరసములఁ దేలరాదా

(॥నీకు॥)
నిచ్చలును భవానాశినీట నోలలాడితి వందు
పచ్చినాచెమటనీరు పతి యిదివో
లచ్చనల గురుడాద్రిలక్మీపతివి నాఁడు
చెచ్చెర శ్రీవేంకటాద్రిశ్రీపతివి నేఁడు

(||pallavi||)
nīgum̐ briyamaina vĕllā nem̐ḍu nāyaṁdivigo
paigŏni segŏnumī yaubhaḽanārasiṁhā

(||nīgu||)
kŏṁḍalĕkki sūsidivi kori yaubhaḽāna nā-
kŏṁḍalagusamulĕ ikkuvavo nīgu
aṁḍane kaṁbāna nuṁṭi valanām̐ḍu nādŏḍalu
niṁḍunaram̐ṭigaṁbālu nīgu nivivo

(||nīgu||)
yĕttidivi rĕṁḍurūbu legamainamenu nām̐ḍu
attinanīnārūbu laḍuvalĕm̐bo
sittagiṁchi navanārasiṁhamulai vuṁṭi vāḍa
mŏtta minānavarasamulam̐ delarādā

(||nīgu||)
nichchalunu bhavānāśhinīḍa nolalāḍidi vaṁdu
pachchināsĕmaḍanīru padi yidivo
lachchanala guruḍādrilakmībadivi nām̐ḍu
sĕchchĕra śhrīveṁkaḍādriśhrībadivi nem̐ḍu