Neegum bodu naagum bodu ninnamonnadi vaaramaa

నీకుఁ బోదు నాకుఁ బోదు నిన్నమొన్నటి వారమా
Language

(॥పల్లవి॥)
నీకుఁ బోదు నాకుఁ బోదు నిన్నమొన్నటి వారమా
పైకొని నీ వడిగిన పంతము లిచ్చేను

(॥నీకు॥)
నీవు నాకు మోహింతువు నేను నది యెరుఁగుదు
కావిరి నావిరహనఁ గసరితిని
వానిగల మేనవారు వలసిన ట్టందురు
నీవిచ్చినచనవే నే నిందుకు మొక్కేను

(॥నీకు॥)
నామాట మీరవు నమ్మితి నే నంతయును
కామించినఁ దాన గాన కైమీరితిని
చేముట్టి తమపతులు చెలువేమైనాఁ జేతురు
నీమన్ననఁ గూడ నిట్టె నేఁ జెక్కు నొక్కేను

(॥నీకు॥)
తనువు లిద్దరి విని తతి నెపుడు నొకటే
కొనపరిదాన గాన కూడితి నిన్ను
ననుపు శ్రీ వేంకటేశు నాకు దక్కేగా గాపురము
పెనగి నీదయఁ గూడ ప్రియము చెప్పితిని

(||pallavi||)
nīgum̐ bodu nāgum̐ bodu ninnamŏnnaḍi vāramā
paigŏni nī vaḍigina paṁtamu lichchenu

(||nīgu||)
nīvu nāgu mohiṁtuvu nenu nadi yĕrum̐gudu
kāviri nāvirahanam̐ gasaridini
vānigala menavāru valasina ṭṭaṁduru
nīvichchinasanave ne niṁdugu mŏkkenu

(||nīgu||)
nāmāḍa mīravu nammidi ne naṁtayunu
kāmiṁchinam̐ dāna gāna kaimīridini
semuṭṭi tamabadulu sĕluvemainām̐ jeduru
nīmannanam̐ gūḍa niṭṭĕ nem̐ jĕkku nŏkkenu

(||nīgu||)
tanuvu liddari vini tadi nĕbuḍu nŏgaḍe
kŏnabaridāna gāna kūḍidi ninnu
nanubu śhrī veṁkaḍeśhu nāgu dakkegā gāburamu
pĕnagi nīdayam̐ gūḍa priyamu sĕppidini