Neegum bodu naagum bodu neevela sigguvadevu

నీకుఁ బోదు నాకుఁ బోదు నీవేల సిగ్గువడేవు
Language

(॥పల్లవి॥)
నీకుఁ బోదు నాకుఁ బోదు నీవేల సిగ్గువడేవు
కాకుసేసి నీ మీఁద కాఁతాళించేనా

(॥నీకు॥)
యెంత నీవేమి సేసినా ఇచ్చకమాడుదుఁగాక
వంతములాడేనా పతివి నీవు
చెంతఁ జేరకుండితేను చేవట్టి తీతుఁగాక
వింతదానివలె నిన్ను వెంగెములాడేనా

(॥నీకు॥)
నీవెంతపరాకై వున్నా నిన్ను నెచ్చరింతుఁగాక
రావంటా నిన్ను దూరేనా రమణుఁడవు
కైవసము గాకుండితే కరుణ వుట్టించుఁగాక
వేసేలైనా నీకుఁ గడువేసట వుట్టించేనా

(॥నీకు॥)
కడల నీవుడినాను కాఁగించుకొందుఁగాక
చిడుముడి పడేనా శ్రీవేంకటేశ
యెడయక మన్నించి యేలితివి నన్ను నేఁడు
తొడిఁబడ నిందరిలో దూరుసేసేనా

(||pallavi||)
nīgum̐ bodu nāgum̐ bodu nīvela sigguvaḍevu
kāgusesi nī mīm̐da kām̐tāḽiṁchenā

(||nīgu||)
yĕṁta nīvemi sesinā ichchagamāḍudum̐gāga
vaṁtamulāḍenā padivi nīvu
sĕṁtam̐ jeraguṁḍidenu sevaṭṭi tīdum̐gāga
viṁtadānivalĕ ninnu vĕṁgĕmulāḍenā

(||nīgu||)
nīvĕṁtabarāgai vunnā ninnu nĕchchariṁtum̐gāga
rāvaṁṭā ninnu dūrenā ramaṇum̐ḍavu
kaivasamu gāguṁḍide karuṇa vuṭṭiṁchum̐gāga
veselainā nīgum̐ gaḍuvesaḍa vuṭṭiṁchenā

(||nīgu||)
kaḍala nīvuḍinānu kām̐giṁchugŏṁdum̐gāga
siḍumuḍi paḍenā śhrīveṁkaḍeśha
yĕḍayaga manniṁchi yelidivi nannu nem̐ḍu
tŏḍim̐baḍa niṁdarilo dūrusesenā