నీకుఁ బోదు నాకుఁ బోదు నీతోడిది లోకము
(॥పల్లవి॥)
నీకుఁ బోదు నాకుఁ బోదు నీతోడిది లోకము
ఆ కడనెవ్వరు నిన్ను నాడకున్నఁ జాలును
(॥నీకు॥)
తొల్లె నీకు వలచితిఁ దుద మీర
యెల్లగా నాఁడే నీకె యెక్కెనీమేను
చెల్లఁబో మరుఁడేమైనాఁ జేయనీ నన్ను
మొల్లమి నాదూరు నిన్ను మోయకున్నఁజాలును
(॥నీకు॥)
వచ్చితి సాహసాన నీ వద్దికి నేను
పచ్చిగా నావయసు నీపాలు సేసితి
చెచ్చెర నెవ్వరేమైనాఁ జేయనీ నన్ను
ముచ్చట దోసము నిన్ను ముట్టకున్నఁ జాలును
(॥నీకు॥)
గక్కునఁ గలసితి నీకాఁగిట నేను
దక్కితి శ్రీవేంకటేశ దయ గంటిని
చిక్కుఁ జీరు నింటివారు సేయనీ నన్ను
మొక్కలానఁ గీడు నిన్ను ముట్టకున్నఁజాలును
(||pallavi||)
nīgum̐ bodu nāgum̐ bodu nīdoḍidi logamu
ā kaḍanĕvvaru ninnu nāḍagunnam̐ jālunu
(||nīgu||)
tŏllĕ nīgu valasidim̐ duda mīra
yĕllagā nām̐ḍe nīgĕ yĕkkĕnīmenu
sĕllam̐bo marum̐ḍemainām̐ jeyanī nannu
mŏllami nādūru ninnu moyagunnam̐jālunu
(||nīgu||)
vachchidi sāhasāna nī vaddigi nenu
pachchigā nāvayasu nībālu sesidi
sĕchchĕra nĕvvaremainām̐ jeyanī nannu
muchchaḍa dosamu ninnu muṭṭagunnam̐ jālunu
(||nīgu||)
gakkunam̐ galasidi nīgām̐giḍa nenu
dakkidi śhrīveṁkaḍeśha daya gaṁṭini
sikkum̐ jīru niṁṭivāru seyanī nannu
mŏkkalānam̐ gīḍu ninnu muṭṭagunnam̐jālunu