నీకుఁ బోదు నాకుఁ బోదు నీ వెట్టు సేసినా జేయి
(॥పల్లవి॥)
నీకుఁ బోదు నాకుఁ బోదు నీ వెట్టు సేసినా జేయి
సాకిరివంటిది నా జవ్వన మిందుకును
(॥నీకు॥)
చిగురువంటిది నా చిత్త మిదె నీమీఁదఁ
దగిలి విడువదు నీ తగురూపు
తగరువంటిది నా తమకము మీఁద మీఁద
అగడు సేయుచు నీ యాయాలు దా కీని
(॥నీకు॥)
లచ్చనవంటిది నా పలుకు నీ యెడకును
అచ్చమై చూడఁ జూడఁగ నందమై యుండు
నిచ్చెనల వంటివి నా నిండుఁగోరికలు నీకు
హెచ్చినవలపు తల కెక్కఁ జేసె యందుకు
(॥నీకు॥)
గాలమువంటిది నా కౌఁగిటికూటమి నీకు
తలి మఱి యెందుకును తొలఁగ రాదు
తాలమువంటిది నా తగులమి నీమీఁద
మేలిమి శ్రీవేంకటేశ మాఁదాఁ గిందాఁ బాయదు
(||pallavi||)
nīgum̐ bodu nāgum̐ bodu nī vĕṭṭu sesinā jeyi
sāgirivaṁṭidi nā javvana miṁdugunu
(||nīgu||)
siguruvaṁṭidi nā sitta midĕ nīmīm̐dam̐
dagili viḍuvadu nī tagurūbu
tagaruvaṁṭidi nā tamagamu mīm̐da mīm̐da
agaḍu seyusu nī yāyālu dā kīni
(||nīgu||)
lachchanavaṁṭidi nā palugu nī yĕḍagunu
achchamai sūḍam̐ jūḍam̐ga naṁdamai yuṁḍu
nichchĕnala vaṁṭivi nā niṁḍum̐gorigalu nīgu
hĕchchinavalabu tala kĕkkam̐ jesĕ yaṁdugu
(||nīgu||)
gālamuvaṁṭidi nā kaum̐giḍigūḍami nīgu
tali maṟi yĕṁdugunu tŏlam̐ga rādu
tālamuvaṁṭidi nā tagulami nīmīm̐da
melimi śhrīveṁkaḍeśha mām̐dām̐ giṁdām̐ bāyadu