నీకు విన్నవించితిమి నీ దేవుల సుద్దు లివి
(॥పల్లవి॥)
నీకు విన్నవించితిమి నీ దేవుల సుద్దు లివి
చేకొని మన్నించి ఇట్టె చిత్తానఁ బెట్టవయ్యా
(॥నీకు॥)
ఇందుముఖి, నీవు దనఇంటికి వచ్చేవంటా
కందువ నప్పటనుండీఁ గాచుకున్నది
సందడించి తనపై సేసలు వెట్టేవంటాను
చెందిన వేడుకలతో సింగారించుకున్నది
(॥నీకు॥)
మంతనానఁ దనతోను మాఁటలాడే వంటాను
పొంత బానుపు వేసుక పొంచుకున్నది
సంతతము నీ రతుల సాముసేసీనంటాను
వింత కాఁగిట గరడి వెలఇంచుకున్నది
(॥నీకు॥)
వేవేలుగ నీకుఁ దానే విందులు వెట్టీనంటా
మోవిపంటి బోనాలు మోచుకున్నది
యీవేళ శ్రీవేంకటేశ యిట్టె యీకె నేలితివి
చేవదేరే యానంగానఁ జిమ్మిరేఁగి వున్నది
(||pallavi||)
nīgu vinnaviṁchidimi nī devula suddu livi
segŏni manniṁchi iṭṭĕ sittānam̐ bĕṭṭavayyā
(||nīgu||)
iṁdumukhi, nīvu dana̮iṁṭigi vachchevaṁṭā
kaṁduva nappaḍanuṁḍīm̐ gāsugunnadi
saṁdaḍiṁchi tanabai sesalu vĕṭṭevaṁṭānu
sĕṁdina veḍugalado siṁgāriṁchugunnadi
(||nīgu||)
maṁtanānam̐ danadonu mām̐ṭalāḍe vaṁṭānu
pŏṁta bānubu vesuga pŏṁchugunnadi
saṁtadamu nī radula sāmusesīnaṁṭānu
viṁta kām̐giḍa garaḍi vĕla̮iṁchugunnadi
(||nīgu||)
veveluga nīgum̐ dāne viṁdulu vĕṭṭīnaṁṭā
movibaṁṭi bonālu mosugunnadi
yīveḽa śhrīveṁkaḍeśha yiṭṭĕ yīgĕ nelidivi
sevadere yānaṁgānam̐ jimmirem̐gi vunnadi