నీకు వలచినట్లుండు నీ రమణుఁడు
(॥పల్లవి॥)
నీకు వలచినట్లుండు నీ రమణుఁడు
మేకొనీ నీ సింగారపు మిసమిసలు
(॥నీకు॥)
చద్దికి వేఁడికి గడుచవులు రేఁచీఁ బతికి
ముద్దులమాటల నీముసగసలు
వుద్దండాన రతులకు నొడిగట్టఁ జేసీ నవె
గద్దరిచూపుల నీకరకరులు
(॥నీకు॥)
పన్నుక సరసములఁ బలుమారుఁ బెనఁగించీ
సన్నలపొందుల నీసదమాదాలు
యెన్నరానివేడుకల కింపులువుట్చించీ నిదె
వెన్నెలనవ్వుల నీవికవికలు
(॥నీకు॥)
కమ్ముక తమకములు ఘనముగఁ బుట్టీంచీ
దొమ్ముల నీకాఁగిటితుదిపదాలు
కొమ్మరొ శ్రీవేంకటేశుఁ గూడినగురుతు లివె
నెమ్మది మోముకళల నిగనిగలు
(||pallavi||)
nīgu valasinaṭluṁḍu nī ramaṇum̐ḍu
megŏnī nī siṁgārabu misamisalu
(||nīgu||)
saddigi vem̐ḍigi gaḍusavulu rem̐sīm̐ badigi
muddulamāḍala nīmusagasalu
vuddaṁḍāna radulagu nŏḍigaṭṭam̐ jesī navĕ
gaddarisūbula nīgaragarulu
(||nīgu||)
pannuga sarasamulam̐ balumārum̐ bĕnam̐giṁchī
sannalabŏṁdula nīsadamādālu
yĕnnarāniveḍugala kiṁpuluvuṭchiṁchī nidĕ
vĕnnĕlanavvula nīvigavigalu
(||nīgu||)
kammuga tamagamulu ghanamugam̐ buṭṭīṁchī
dŏmmula nīgām̐giḍidudibadālu
kŏmmarŏ śhrīveṁkaḍeśhum̐ gūḍinagurudu livĕ
nĕmmadi momugaḽala niganigalu