నీకు సరి లేరీ నిఖిలలోకములలో
(॥పల్లవి॥)
నీకు సరి లేరీ నిఖిలలోకములలో
కాకాసురుని నట్లఁ గాచితివి నీవు
(॥నీకు॥)
హరి పరమపురుషా యచ్చుతానంతా
కరివరద మురహరా కరుణానిధీ
ధర యాకసము బలి తలయు మూఁ డడుగులను
పరగఁ గైకొన్నయట్టి బలువుఁడవు నీవు
(॥నీకు॥)
మాధవా భూధవా మధుసూదనా కృష్ణ
శ్రీధరా శ్రీపతీ శ్రీనివాస
శోధించి జలధులు చొచ్చి చదువులు దెచ్చి
ఆ ధాత కిచ్చితివి అధికుఁడవు నీవు
(॥నీకు॥)
వామన కేశవ వాసుదేవ ముకుంద
రామ గోవింద చక్రకరాంబుజా
ఆ మహిమ శ్రీ వేంకటాద్రిమీఁదట నెక్కి
కామితఫలముల నిచ్చు ఘనుఁడవు నీవు
(||pallavi||)
nīgu sari lerī nikhilalogamulalo
kāgāsuruni naṭlam̐ gāsidivi nīvu
(||nīgu||)
hari paramaburuṣhā yachchudānaṁtā
karivarada muraharā karuṇānidhī
dhara yāgasamu bali talayu mūm̐ ḍaḍugulanu
paragam̐ gaigŏnnayaṭṭi baluvum̐ḍavu nīvu
(||nīgu||)
mādhavā bhūdhavā madhusūdanā kṛṣhṇa
śhrīdharā śhrībadī śhrīnivāsa
śhodhiṁchi jaladhulu sŏchchi saduvulu dĕchchi
ā dhāda kichchidivi adhigum̐ḍavu nīvu
(||nīgu||)
vāmana keśhava vāsudeva muguṁda
rāma goviṁda sakragarāṁbujā
ā mahima śhrī veṁkaḍādrimīm̐daḍa nĕkki
kāmidaphalamula nichchu ghanum̐ḍavu nīvu