Neegu nimpainavaarine nemu pogademugaaga

నీకు నింపైనవారినే నేము పొగడేముగాక
Language

(॥పల్లవి॥)
నీకు నింపైనవారినే నేము పొగడేముగాక
పైకొలిపిన వలపు పనికి వచ్చీనా

(॥॥)
మనసు వచ్చినవారే మంచి గుణములవారు
కనుపట్టినవారే చక్కని వారలు
యెనయని వనితల నెందరి నీకుఁ జెప్పినా
పెనఁగులాటే కాక ప్రియ మయ్యీనా

(॥॥)
నీవు సరసమాడిన నెలఁతలే జాణలు
కావలసినవారే నిక్కపు జుట్టా లు
వే వేల నెందరి నెంత వేడుకకుఁ జూపినాను
దావతి పడుటే కాక తమి వుట్టీ నా

(॥॥)
యిట్టే నీ మన్నన గల యింతులే భాగ్యవతులు
పట్టి నీ వేలినవారే బలవంతులు
నెట్టన శ్రీ వేంకటేశ నేఁ డు నన్నుఁ గూడితివి
కట్టఁ గడ వా రెరవే కాక యితవయ్యీనా

(||pallavi||)
nīgu niṁpainavārine nemu pŏgaḍemugāga
paigŏlibina valabu panigi vachchīnā

(||||)
manasu vachchinavāre maṁchi guṇamulavāru
kanubaṭṭinavāre sakkani vāralu
yĕnayani vanidala nĕṁdari nīgum̐ jĕppinā
pĕnam̐gulāḍe kāga priya mayyīnā

(||||)
nīvu sarasamāḍina nĕlam̐tale jāṇalu
kāvalasinavāre nikkabu juṭṭā lu
ve vela nĕṁdari nĕṁta veḍugagum̐ jūbinānu
dāvadi paḍuḍe kāga tami vuṭṭī nā

(||||)
yiṭṭe nī mannana gala yiṁtule bhāgyavadulu
paṭṭi nī velinavāre balavaṁtulu
nĕṭṭana śhrī veṁkaḍeśha nem̐ ḍu nannum̐ gūḍidivi
kaṭṭam̐ gaḍa vā rĕrave kāga yidavayyīnā