నీకు నిచ్చకురాలనై నే నుండుటే మేలు
(॥పల్లవి॥)
నీకు నిచ్చకురాలనై నే నుండుటే మేలు
కాకు సేసి నిన్ను నింత గరిసించ నేఁటికి
(॥నీకు॥)
వంతులకు నాపెమీఁదివలపు నీవు మానేవా
చింతతోడ నొకమాట చెప్పితిఁ గాక
యెంతలేదు నీ వింకా నెందరిఁ బెండ్లాడినాను
సంతోసమే నాకు నిన్ను సాదించ నేఁటికి
(॥నీకు॥)
యేతులకు నాపె నీవూ యెనసి వుండ కుండేరా
చూతమంటా మీదిక్కు చూచేఁ గాక
కాతర మే లెందరితోఁ గాఁపురాలు సేసినాను
నీతి గా దనుచు నిన్ను నియమించ నేఁటికి
(॥నీకు॥)
మోము చూచి ఆపెతోడ ముచ్చటాడ కుండేవా
ప్రేమముతో నీపై సేవ పెట్టితిఁ గాక
సాము చేసి యెందరితో సందడిఁ బెనఁగినాను
యేమాయ శ్రీవేంకటేశ యెలయించ నేఁటికి
(||pallavi||)
nīgu nichchagurālanai ne nuṁḍuḍe melu
kāgu sesi ninnu niṁta garisiṁcha nem̐ṭigi
(||nīgu||)
vaṁtulagu nābĕmīm̐divalabu nīvu mānevā
siṁtadoḍa nŏgamāḍa sĕppidim̐ gāga
yĕṁtaledu nī viṁkā nĕṁdarim̐ bĕṁḍlāḍinānu
saṁtosame nāgu ninnu sādiṁcha nem̐ṭigi
(||nīgu||)
yedulagu nābĕ nīvū yĕnasi vuṁḍa kuṁḍerā
sūdamaṁṭā mīdikku sūsem̐ gāga
kādara me lĕṁdaridom̐ gām̐purālu sesinānu
nīdi gā danusu ninnu niyamiṁcha nem̐ṭigi
(||nīgu||)
momu sūsi ābĕdoḍa muchchaḍāḍa kuṁḍevā
premamudo nībai seva pĕṭṭidim̐ gāga
sāmu sesi yĕṁdarido saṁdaḍim̐ bĕnam̐ginānu
yemāya śhrīveṁkaḍeśha yĕlayiṁcha nem̐ṭigi