Neegu nichchagame nerabudum gaa kidu

నీకు నిచ్చకమే నెరపుదుఁ గా కిటు
Language

(॥పల్లవి॥)
నీకు నిచ్చకమే నెరపుదుఁ గా కిటు
కాకు సేసి నినుఁ గదిమేనా

(॥నీకు॥)
యెమ్మెకు నాతో నెంత నవ్వినా
కిమ్ముల నాతోఁ గిని సేనా
నిమ్మపంటఁ గొని నీవెంత వేసిన
ముమ్మాటికి నే ములిగేనా

(॥నీకు॥)
తొడిఁబడ నీవే తురుము వట్టితే
బెడిదంబుగ నేఁ బెనఁగేనా
అడరి నీవు రమ్మని ననుఁ బిలువఁగ
వోడకఁ బండ నని వొదిగేనా

(॥నీకు॥)
పైకొని నీవే పాదము చాఁచగ
చేకొని పిసుకక సెలసేనా
యీకడ శ్రీవెంకటేశ్వర కూడితివి
యేకడ కేఁగఁగ నిచ్చేనా

(||pallavi||)
nīgu nichchagame nĕrabudum̐ gā kiḍu
kāgu sesi ninum̐ gadimenā

(||nīgu||)
yĕmmĕgu nādo nĕṁta navvinā
kimmula nādom̐ gini senā
nimmabaṁṭam̐ gŏni nīvĕṁta vesina
mummāḍigi ne muligenā

(||nīgu||)
tŏḍim̐baḍa nīve turumu vaṭṭide
bĕḍidaṁbuga nem̐ bĕnam̐genā
aḍari nīvu rammani nanum̐ biluvam̐ga
voḍagam̐ baṁḍa nani vŏdigenā

(||nīgu||)
paigŏni nīve pādamu sām̐saga
segŏni pisugaga sĕlasenā
yīgaḍa śhrīvĕṁkaḍeśhvara kūḍidivi
yegaḍa kem̐gam̐ga nichchenā