నీకు నిచ్చకమాడ నేర్తుఁ గాక యిట్లయినఁ
(॥పల్లవి॥)
నీకు నిచ్చకమాడ నేర్తుఁ గాక యిట్లయినఁ
గాక నీ కెదురాడఁగలనా నేను
(॥నీకు॥)
చలివిడిచి నాయకుని సాదించుఁ గడు నొకతె
అలరి తను నెడసితే నలుగు నొకతె
వొలసి నొల్లమియైన వొగిఁ గోపగించు నొకతె
నిలిచి యింతటినికి నేర్తునా నేను
(॥నీకు॥)
సరవి దప్పిన విభుని జంకించుఁ గడు నొకతె
సరసంబు లాడితే జరయు నొకతె
వరుస వంతెడలినను వాదించు మఱి యొకతె
పరగ నింతేసి కొడఁబడుదునా నేను
(॥నీకు॥)
అంకంపు రతులలో నలయించుఁ బతి నొకతె
మంకుమర్మపుఁ గళల మఱచు నొకతె
యింకేల శ్రీవేంకటేశ కూడితివి నను
వుంకువల వెనకఁ దడవుదునా నేను
(||pallavi||)
nīgu nichchagamāḍa nerdum̐ gāga yiṭlayinam̐
gāga nī kĕdurāḍam̐galanā nenu
(||nīgu||)
saliviḍisi nāyaguni sādiṁchum̐ gaḍu nŏgadĕ
alari tanu nĕḍaside nalugu nŏgadĕ
vŏlasi nŏllamiyaina vŏgim̐ gobagiṁchu nŏgadĕ
nilisi yiṁtaḍinigi nerdunā nenu
(||nīgu||)
saravi dappina vibhuni jaṁkiṁchum̐ gaḍu nŏgadĕ
sarasaṁbu lāḍide jarayu nŏgadĕ
varusa vaṁtĕḍalinanu vādiṁchu maṟi yŏgadĕ
paraga niṁtesi kŏḍam̐baḍudunā nenu
(||nīgu||)
aṁkaṁpu radulalo nalayiṁchum̐ badi nŏgadĕ
maṁkumarmabum̐ gaḽala maṟasu nŏgadĕ
yiṁkela śhrīveṁkaḍeśha kūḍidivi nanu
vuṁkuvala vĕnagam̐ daḍavudunā nenu