Neegu nemu baamteyyemaa nemdibudu

నీకు నేము బాఁతెయ్యేమా నేఁడిపుడు
Language

(॥పల్లవి॥)
నీకు నేము బాఁతెయ్యేమా నేఁడిపుడు
ఆకు మడిచిమ్మంటా నాసలు రేఁచేవు

(॥నీకు॥)
విందుచెప్పేయాపె నిన్నువిడిదికిఁ బిలుచుక
మందలించి వొయ్యనే మరిగించెను
పందేలువేసి నీతో పగడసా లాడియాడి
కందువైనరతులలెక్కలు మోపెను

(॥నీకు॥)
పెక్కుకానికె లొసఁగి పీఁటపైఁ గూచుండఁబెట్టి
గక్కన నీమనసెల్లఁ గరంగించెను
చిక్కించి చుట్టరికాలుచెప్పి విడెములువెట్టి
దక్కఁగొని నిన్ను నిట్టె తగిలించుకొనెను

(॥నీకు॥)
యిచ్చగించి పాదాలొత్తి యేకతానఁ దెరవేసి
మెచ్చులుగాఁ గాఁగిలించి మెప్పించెను
యిచ్చట శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
తచ్చి తా నాపొందు నీకుఁ దలఁపించెను

(||pallavi||)
nīgu nemu bām̐tĕyyemā nem̐ḍibuḍu
āgu maḍisimmaṁṭā nāsalu rem̐sevu

(||nīgu||)
viṁdusĕppeyābĕ ninnuviḍidigim̐ bilusuga
maṁdaliṁchi vŏyyane marigiṁchĕnu
paṁdeluvesi nīdo pagaḍasā lāḍiyāḍi
kaṁduvainaradulalĕkkalu mobĕnu

(||nīgu||)
pĕkkugānigĕ lŏsam̐gi pīm̐ṭabaim̐ gūsuṁḍam̐bĕṭṭi
gakkana nīmanasĕllam̐ garaṁgiṁchĕnu
sikkiṁchi suṭṭarigālusĕppi viḍĕmuluvĕṭṭi
dakkam̐gŏni ninnu niṭṭĕ tagiliṁchugŏnĕnu

(||nīgu||)
yichchagiṁchi pādālŏtti yegadānam̐ dĕravesi
mĕchchulugām̐ gām̐giliṁchi mĕppiṁchĕnu
yichchaḍa śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
tachchi tā nābŏṁdu nīgum̐ dalam̐piṁchĕnu