Neegu neeve valaside neevu nannum gaasugommu

నీకు నీవే వలసితే నీవు నన్నుఁ గాచుకొమ్ము
Language

(॥పల్లవి॥)
నీకు నీవే వలసితే నీవు నన్నుఁ గాచుకొమ్ము
నాకు వసగానివెల్ల నన్నుఁ బాసీనయ్య

(॥నీకు॥)
పాపములతోడఁ బుట్టె పైకొన్న దేహము
పాపము సేయకుమంటే పక్కున నేల మానును
కోపమే కూడుగాఁ గడిచినయట్టి బుద్ధి
కోపము విడువమంటే గుణమేల మానును

(॥నీకు॥)
అప్పు డేర్పించవచ్చిన యట్టి యీసంసారము
అప్పు దీర్చుకోకుమంటే నది యేల మానును
తప్పు వేయ వచ్చి నన్ను తగిలె నీ కర్మము
తప్పులు వేయక సారె తా మేల మానును

(॥నీకు॥)
పంచమహాపాతక భోగపుటింద్రియములు
పంచమహాపాతకపు బారిఁ దోయ కేల మాను
అంచ శ్రీవేంకటేశ నీవాతుమలో నుండఁగాను
పొంచి నీ కరుణ నన్ను పొదుగ కేల మానును

(||pallavi||)
nīgu nīve valaside nīvu nannum̐ gāsugŏmmu
nāgu vasagānivĕlla nannum̐ bāsīnayya

(||nīgu||)
pābamuladoḍam̐ buṭṭĕ paigŏnna dehamu
pābamu seyagumaṁṭe pakkuna nela mānunu
kobame kūḍugām̐ gaḍisinayaṭṭi buddhi
kobamu viḍuvamaṁṭe guṇamela mānunu

(||nīgu||)
appu ḍerbiṁchavachchina yaṭṭi yīsaṁsāramu
appu dīrsugogumaṁṭe nadi yela mānunu
tappu veya vachchi nannu tagilĕ nī karmamu
tappulu veyaga sārĕ tā mela mānunu

(||nīgu||)
paṁchamahābādaga bhogabuḍiṁdriyamulu
paṁchamahābādagabu bārim̐ doya kela mānu
aṁcha śhrīveṁkaḍeśha nīvādumalo nuṁḍam̐gānu
pŏṁchi nī karuṇa nannu pŏduga kela mānunu