Neegu neeve soosugommee neeyamdu nerami

నీకు నీవే చూచుకొమ్మీ నీయందు నేరమి
Language

(॥పల్లవి॥)
నీకు నీవే చూచుకొమ్మీ నీయందు నేరమి
మాకుఁ దెలియదు యేమి మఱఁగో కాక

(॥నీకు॥)
సెలవుల నగితేనే సిగ్గులకు వెలితా
కలికి నీయందు నేమి గనెనో కాక
కులికి మాటాడితేనే గుట్టులేనిదాయనా
వెలి నీచేఁత కదేమి వేఁగెనోకాక

(॥నీకు॥)
తప్పకచూచితే పంతమునకు వెలితా
చెప్పరానిపని యేమిసేసితోకాక
యిప్పుడే తలవంచితే యెమ్మెలకు హీనమా
అప్పుడే యేయాయము నీవంటితోకాక

(॥నీకు॥)
బొమ్మల జంకించితేనే పొందులకు వెలితా
సొమ్మల నీగో రేడ సోఁకెనోకాక
నెమ్మది శ్రీవేంకటేశ నెలఁతఁ గూడితి విట్టె
వుమ్మడితమక మెంత వుండెనో కాని

(||pallavi||)
nīgu nīve sūsugŏmmī nīyaṁdu nerami
māgum̐ dĕliyadu yemi maṟam̐go kāga

(||nīgu||)
sĕlavula nagidene siggulagu vĕlidā
kaligi nīyaṁdu nemi ganĕno kāga
kuligi māḍāḍidene guṭṭulenidāyanā
vĕli nīsem̐ta kademi vem̐gĕnogāga

(||nīgu||)
tappagasūside paṁtamunagu vĕlidā
sĕpparānibani yemisesidogāga
yippuḍe talavaṁchide yĕmmĕlagu hīnamā
appuḍe yeyāyamu nīvaṁṭidogāga

(||nīgu||)
bŏmmala jaṁkiṁchidene pŏṁdulagu vĕlidā
sŏmmala nīgo reḍa som̐kĕnogāga
nĕmmadi śhrīveṁkaḍeśha nĕlam̐tam̐ gūḍidi viṭṭĕ
vummaḍidamaga mĕṁta vuṁḍĕno kāni