నీకు నీవే పదరేవు నేనేమీ ననను
(॥పల్లవి॥)
నీకు నీవే పదరేవు నేనేమీ ననను
కైకొని యేరా నీవు కన్నులు మూసేవు
(॥నీకు॥)
చేరలంతలుకన్నుల చేరి జంకించితినో
కోరి నిన్నుఁ బెదవుల గొణఁగితినో
కేరి సెలవుల నవ్వి కేరడమాడితినో
యేరా సిగ్గుడేవు యింతలోనే నీవు
(॥నీకు॥)
జక్కవ చన్నుల నిన్ను సారె నొరసితినో
వెక్కనపు మాఁటలు వెంగెములాడినో
మక్కువ నీమేనిమీఁదిమచ్చము వట్టితినో
తక్కక యేరా నీవు తలవంచేనిపుడు
(॥నీకు॥)
కాఁగిలించి నీమేన ఘాతలు సేసితినో
తోఁగిసరతుల సరిదూఁగనైతినో
దాఁగక శ్రీవేంకటేశ తగ నన్నుఁ గూడితివి
మాఁగుచు నేరా నీవు మఱచేవు మేను
(||pallavi||)
nīgu nīve padarevu nenemī nananu
kaigŏni yerā nīvu kannulu mūsevu
(||nīgu||)
seralaṁtalugannula seri jaṁkiṁchidino
kori ninnum̐ bĕdavula gŏṇam̐gidino
keri sĕlavula navvi keraḍamāḍidino
yerā sigguḍevu yiṁtalone nīvu
(||nīgu||)
jakkava sannula ninnu sārĕ nŏrasidino
vĕkkanabu mām̐ṭalu vĕṁgĕmulāḍino
makkuva nīmenimīm̐dimachchamu vaṭṭidino
takkaga yerā nīvu talavaṁchenibuḍu
(||nīgu||)
kām̐giliṁchi nīmena ghādalu sesidino
tom̐gisaradula saridūm̐ganaidino
dām̐gaga śhrīveṁkaḍeśha taga nannum̐ gūḍidivi
mām̐gusu nerā nīvu maṟasevu menu