నీకు నీవే గడించుకొనేవు గాక యేమైనా
(॥పల్లవి॥)
నీకు నీవే గడించుకొనేవు గాక యేమైనా
దాకొని ని న్నందరిలో తగదంటినా
(॥నీకు॥)
ఆవల వేరే మరి ఆనవెట్టవలెనా
నీవాడేమాటలు నిజమేకావా
వేవేలుగా నిందు వెంగెమేమైనా వున్నదా
నావద్ద నీవుండఁగాను నమ్మనంటినా
(॥నీకు॥)
చెలులచే యింకా చెప్పించవలెనా
వెలయ నీవాడినవే వేదాలుగావా
వెలుపలి సుద్దులెల్లా వెలుచుకొంటాయిది
పిలిచి మరేమైనా బేరుకొంటినా
(॥నీకు॥)
చూడుమని నీమేను సోదనియ్యవలెనా
జాడతో నీసేఁతలు సత్యాలుగావా
వేడుకఁ గూడితివి శ్రీవేంకటేశ నన్ను నిట్టె
యేడ నేర్చతివి రతు లివి యంటినా
(||pallavi||)
nīgu nīve gaḍiṁchugŏnevu gāga yemainā
dāgŏni ni nnaṁdarilo tagadaṁṭinā
(||nīgu||)
āvala vere mari ānavĕṭṭavalĕnā
nīvāḍemāḍalu nijamegāvā
vevelugā niṁdu vĕṁgĕmemainā vunnadā
nāvadda nīvuṁḍam̐gānu nammanaṁṭinā
(||nīgu||)
sĕlulase yiṁkā sĕppiṁchavalĕnā
vĕlaya nīvāḍinave vedālugāvā
vĕlubali suddulĕllā vĕlusugŏṁṭāyidi
pilisi maremainā berugŏṁṭinā
(||nīgu||)
sūḍumani nīmenu sodaniyyavalĕnā
jāḍado nīsem̐talu satyālugāvā
veḍugam̐ gūḍidivi śhrīveṁkaḍeśha nannu niṭṭĕ
yeḍa nersadivi radu livi yaṁṭinā