Neegu neege yamarunu neelonane

నీకు నీకే యమరును నీలోననే
Language

(॥పల్లవి॥)
నీకు నీకే యమరును నీలోననే
చౌక లేక నేమెట్టు సమ్మతించేమయ్యా

(॥॥)
పచ్చిదేరే మాఁటల బయలీఁతమాటలూ
కుచ్చితపు వెంగేల కొనమాటలూ
నెచ్చులులతో నాడ నేరుతు విన్నిటా నీవు
యిచ్చగించి చెవులార నెట్టు వినేమయ్యా

(॥॥)
కాకుసేసే చేఁతలూ కతకారి చేఁతలూ
లాకల సిగ్గుమీరిన లండుఁ జేఁతలూ
దీకొని యిందుకునే సాదించితివి తొల్లే నీవు
పైకొని యింతులకెట్టు పడవచ్చునయ్యా

(॥॥)
కవకవ నవ్వుల కాతరపు నవ్వులు
చవులతో నెప్పుడును సాజమే నీకు
యివల శ్రీవేంకటేశ యెనసితివిటు నన్ను
భువిలో నిన్నెంతని పొగడేటిదయ్యా

(||pallavi||)
nīgu nīge yamarunu nīlonane
sauga lega nemĕṭṭu sammadiṁchemayyā

(||||)
pachchidere mām̐ṭala bayalīm̐tamāḍalū
kuchchidabu vĕṁgela kŏnamāḍalū
nĕchchululado nāḍa nerudu vinniḍā nīvu
yichchagiṁchi sĕvulāra nĕṭṭu vinemayyā

(||||)
kāgusese sem̐talū kadagāri sem̐talū
lāgala siggumīrina laṁḍum̐ jem̐talū
dīgŏni yiṁdugune sādiṁchidivi tŏlle nīvu
paigŏni yiṁtulagĕṭṭu paḍavachchunayyā

(||||)
kavagava navvula kādarabu navvulu
savulado nĕppuḍunu sājame nīgu
yivala śhrīveṁkaḍeśha yĕnasidiviḍu nannu
bhuvilo ninnĕṁtani pŏgaḍeḍidayyā