నీకు నీకే యాడుకోకు నియ్యాన
(॥పల్లవి॥)
నీకు నీకే యాడుకోకు నియ్యాన
కైకొని నేనే నీపై గడియించేఁ గాని
(॥॥)
అంతవాఁడ వవుదువు అంగనల వలపించి
వంతులకు నీవే నవ్వనోపుదువు
పంతమాడఁ బనిలేదు పలుమారు మాకెల్లా
కాంతుఁడు నిన్నెప్పుడుఁ బొగడవలెఁగాని
(॥॥)
మంచివాఁడ వవుదువు మచ్చికలే పచరించి
వంచి సవతులఁ జూపి వాసిరేఁచును
కొంచ నిఁకఁ బనిలేదు కోడెతనానకు నీవే
చంచులకు రాజవంటాఁ జాటవలెఁగాని
(॥॥)
రసికుఁడ వౌదువు రతులఁ గాఁగిటఁ గూడి
మిసిమిమమ్మెల్లా నీవు మెప్పించను
యెసగి శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
పనగానిమన సిఁకఁ బట్టవలెఁగాని
(||pallavi||)
nīgu nīge yāḍugogu niyyāna
kaigŏni nene nībai gaḍiyiṁchem̐ gāni
(||||)
aṁtavām̐ḍa vavuduvu aṁganala valabiṁchi
vaṁtulagu nīve navvanobuduvu
paṁtamāḍam̐ baniledu palumāru māgĕllā
kāṁtum̐ḍu ninnĕppuḍum̐ bŏgaḍavalĕm̐gāni
(||||)
maṁchivām̐ḍa vavuduvu machchigale pasariṁchi
vaṁchi savadulam̐ jūbi vāsirem̐sunu
kŏṁcha nim̐kam̐ baniledu koḍĕdanānagu nīve
saṁchulagu rājavaṁṭām̐ jāḍavalĕm̐gāni
(||||)
rasigum̐ḍa vauduvu radulam̐ gām̐giḍam̐ gūḍi
misimimammĕllā nīvu mĕppiṁchanu
yĕsagi śhrī veṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
panagānimana sim̐kam̐ baṭṭavalĕm̐gāni