నీకు నీకే తెలుసును నీ చేఁతలు
(॥పల్లవి॥)
నీకు నీకే తెలుసును నీ చేఁతలు
జోకలాయ నీ సుద్దులు సొంపులెల్లా వింటిరా
(॥నీకు॥)
పంతము చూడవలసి పక్కన నవ్వితిఁగాక
కాంతుడ వొచ్చేము నీమైఁ గంటినా యేమి
అంతలోనె సిగ్గువడే వందరిలో నీకునీకే
యెంతని నీగుణమున కిఁక నేమిసేతురా
(॥నీకు॥)
నిజముఁ గనవలసి నీమోము చూచితిఁగాని
భజన నిన్ను నమ్మనిభావమా యేమి
గుజగుజఁబొయ్యేవు కొంకికొంకి నీకునీకే
గజరునీచేఁతలకు కమ్మదా నేమందురా
(॥నీకు॥)
మోహము గానవలసి ముందరమొక్కితిఁగాక
సాహసించి వుప్పటపుసాదనా యేమి
యీహల శ్రీవేంకటేశ ఇంతలోనె కూడితివి
ఆహా నీరతు లెన్నియని పొగడుదురా
(||pallavi||)
nīgu nīge tĕlusunu nī sem̐talu
jogalāya nī suddulu sŏṁpulĕllā viṁṭirā
(||nīgu||)
paṁtamu sūḍavalasi pakkana navvidim̐gāga
kāṁtuḍa vŏchchemu nīmaim̐ gaṁṭinā yemi
aṁtalonĕ sigguvaḍe vaṁdarilo nīgunīge
yĕṁtani nīguṇamuna kim̐ka nemisedurā
(||nīgu||)
nijamum̐ ganavalasi nīmomu sūsidim̐gāni
bhajana ninnu nammanibhāvamā yemi
gujagujam̐bŏyyevu kŏṁkigŏṁki nīgunīge
gajarunīsem̐talagu kammadā nemaṁdurā
(||nīgu||)
mohamu gānavalasi muṁdaramŏkkidim̐gāga
sāhasiṁchi vuppaḍabusādanā yemi
yīhala śhrīveṁkaḍeśha iṁtalonĕ kūḍidivi
āhā nīradu lĕnniyani pŏgaḍudurā