నీకు నీకే చెప్పకో రానియ్యనా
(॥పల్లవి॥)
నీకు నీకే చెప్పకో రానియ్యనా
నాకుఁ జూడ నిన్ను నెట్టు నమ్మవచ్చు రా
(॥నీకు॥)
చిత్తరుపటాన వ్రాసి చిక్కించితి నీ రూపు
అత్తించి మనసులోన నచ్చొత్తితి
యిత్తల నెంతయినా మాన వెందు నైనాఁ దిరిగేవు
నిత్తెము నీ చేఁతలకు నిజ మేదిరా
(॥నీకు॥)
మాటలలో నీ పేరు మంత్రముగాఁ బట్టుకొని
కాటుకకన్నుల నీకుఁ గావ లిడితి
పాటించి నీవు మానవుపలువంచలఁ బడక
కూటపు నీ రాకలకు గుఱు తేదిరా
(॥నీకు॥)
నించిన కౌఁగిటిలో నిన్ను రతిఁ గూడుకొంటి
కంచపు మోవిపొత్తు గలసు కొంటి
యెంచఁగ శ్రీవేంకటేశ యేలో మై మఱచేవు
పొంచి వెంట వెంట రాక పో నట్టు వచ్చురా
(||pallavi||)
nīgu nīge sĕppago rāniyyanā
nāgum̐ jūḍa ninnu nĕṭṭu nammavachchu rā
(||nīgu||)
sittarubaḍāna vrāsi sikkiṁchidi nī rūbu
attiṁchi manasulona nachchŏttidi
yittala nĕṁtayinā māna vĕṁdu nainām̐ dirigevu
nittĕmu nī sem̐talagu nija medirā
(||nīgu||)
māḍalalo nī peru maṁtramugām̐ baṭṭugŏni
kāḍugagannula nīgum̐ gāva liḍidi
pāḍiṁchi nīvu mānavubaluvaṁchalam̐ baḍaga
kūḍabu nī rāgalagu guṟu tedirā
(||nīgu||)
niṁchina kaum̐giḍilo ninnu radim̐ gūḍugŏṁṭi
kaṁchabu movibŏttu galasu kŏṁṭi
yĕṁcham̐ga śhrīveṁkaḍeśha yelo mai maṟasevu
pŏṁchi vĕṁṭa vĕṁṭa rāga po naṭṭu vachchurā