Neegu navvulaidimgaani neebai batti galadaana

నీకు నవ్వులైతిఁగాని నీపై బత్తి గలదాన
Language

(॥పల్లవి॥)
నీకు నవ్వులైతిఁగాని నీపై బత్తి గలదాన
యీకడ నీకె సుద్దు లెట్లియ్యకొందునయ్య*

(॥నీకు॥)
పల్లదాన నాపె నిన్ను పచ్చి తిట్టు తిట్టఁగాను
వెల్లవిరిగా నే నెట్టు విందునయ్యా
వుల్లసానఁ బాదము ని న్నూరకె తాఁకించఁగాను
యెల్లవారిలోనా నే నెట్టు చూతునయ్యా

(॥నీకు॥)
యెదురుగా వచ్చి నీకు నెంగిలి మో వియ్యఁగాను
వుదుటున నే నెట్టు వోరుతునయ్యా
గుదిగొన్న వేడుకతో కొప్పువట్టి తియ్యఁగాను
సదరాన నేనెట్టు సమ్మితింతునయ్యా

(॥నీకు॥)
పువ్వులచెండున నిన్నుఁబూఁచి యాపెవేయఁగాను
వువ్విళ్లూరి నే నె ట్టూరకుందునయ్యా
ఇవ్వల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిదె
చివ్వన నాపె పొందెట్టు చెల్లింతునయ్యా

(||pallavi||)
nīgu navvulaidim̐gāni nībai batti galadāna
yīgaḍa nīgĕ suddu lĕṭliyyagŏṁdunayya*

(||nīgu||)
palladāna nābĕ ninnu pachchi tiṭṭu tiṭṭam̐gānu
vĕllavirigā ne nĕṭṭu viṁdunayyā
vullasānam̐ bādamu ni nnūragĕ tām̐kiṁcham̐gānu
yĕllavārilonā ne nĕṭṭu sūdunayyā

(||nīgu||)
yĕdurugā vachchi nīgu nĕṁgili mo viyyam̐gānu
vuduḍuna ne nĕṭṭu vorudunayyā
gudigŏnna veḍugado kŏppuvaṭṭi tiyyam̐gānu
sadarāna nenĕṭṭu sammidiṁtunayyā

(||nīgu||)
puvvulasĕṁḍuna ninnum̐būm̐si yābĕveyam̐gānu
vuvviḽlūri ne nĕ ṭṭūraguṁdunayyā
ivvala śhrīveṁkaḍeśha yelidivi nannu nidĕ
sivvana nābĕ pŏṁdĕṭṭu sĕlliṁtunayyā