Neegu nadanigim bodu nemu seppedidemi

నీకు నతనికిఁ బోదు నేము చెప్పేటిదేమి
Language

(॥పల్లవి॥)
నీకు నతనికిఁ బోదు నేము చెప్పేటిదేమి
కైకొన్న మీకతలు కంటిమే చలియా

(॥నీకు॥)
తెగరాని పొందులకు తెలిసి వోరువఁగవలె
మొగమోట రిచ్చకము ముంచవలెను
నగనేర్చినందుకును నంటు చూపఁగవలెను
తగులయన రతులకును తరితీపువలెను

(॥నీకు॥)
యెనయు నడియాసలకు లెడమాఁట లాడవలె....
ననుపులకుఁ గనుచూపు నాఁటవలెను
పెనగొన్నవేడుకకు ప్రియము చూపఁగవలెను
తనివిఁ బొందినయెడకు తగ మెచ్చవలెను

(॥నీకు॥)
సమ్మతిఁచినపనికి సరినియ్యకొనఁగవలె
నమ్మినందుకు నిజము నడపవలెను
యిమ్ములను శ్రీవేంకటేశుఁ డిటు నినుఁగూడె
పమ్ముకొనుచేఁత లిఁకాఁ బచరించవలెను

(||pallavi||)
nīgu nadanigim̐ bodu nemu sĕppeḍidemi
kaigŏnna mīgadalu kaṁṭime saliyā

(||nīgu||)
tĕgarāni pŏṁdulagu tĕlisi voruvam̐gavalĕ
mŏgamoḍa richchagamu muṁchavalĕnu
naganersinaṁdugunu naṁṭu sūbam̐gavalĕnu
tagulayana radulagunu taridībuvalĕnu

(||nīgu||)
yĕnayu naḍiyāsalagu lĕḍamām̐ṭa lāḍavalĕ....
nanubulagum̐ ganusūbu nām̐ṭavalĕnu
pĕnagŏnnaveḍugagu priyamu sūbam̐gavalĕnu
tanivim̐ bŏṁdinayĕḍagu taga mĕchchavalĕnu

(||nīgu||)
sammadim̐sinabanigi sariniyyagŏnam̐gavalĕ
namminaṁdugu nijamu naḍabavalĕnu
yimmulanu śhrīveṁkaḍeśhum̐ ḍiḍu ninum̐gūḍĕ
pammugŏnusem̐ta lim̐kām̐ basariṁchavalĕnu