నీకు నాకు నొకఁడే నెయ్యమైన నాయకుఁడు
(॥పల్లవి॥)
నీకు నాకు నొకఁడే నెయ్యమైన నాయకుఁడు
జోకలాయఁ బొందులెల్లా జోలి ఇఁక నేఁటికే
(॥నీకు॥)
తమకించనుఁటికే తలపోఁతలెల్లాను
సముకాననే తేరీ సవతి వింతే
చెమటచేతుల మనచేతు లితఁడె పట్టె
భ్రమసితి మీతనికి పంతా లిఁకనేఁటికే
(॥నీకు॥)
కాతరించనేఁటికే కావలసినపనులు
అతనివల్లనే తేరీ ఆండ్ల మింతే
యేతులమాటలనే యిద్దరిని బుజ్జగించె
ఆతుమలు దనిసితి మార డింక నేఁటికే
(॥నీకు॥)
వేగిరించనేఁటికే వేడుకపడేవెలా
భోగములోనే తేరీఁ దోఁబుట్ల మింతే
యీగతి శ్రీవేంకటేశుఁడిట్టె నిన్ను నన్నుఁ గూడె
బాగుగా జోక్కిలి మిఁక పలునవ్వు లేఁటికే
(||pallavi||)
nīgu nāgu nŏgam̐ḍe nĕyyamaina nāyagum̐ḍu
jogalāyam̐ bŏṁdulĕllā joli im̐ka nem̐ṭige
(||nīgu||)
tamagiṁchanum̐ṭige talabom̐talĕllānu
samugānane terī savadi viṁte
sĕmaḍasedula manasedu lidam̐ḍĕ paṭṭĕ
bhramasidi mīdanigi paṁtā lim̐kanem̐ṭige
(||nīgu||)
kādariṁchanem̐ṭige kāvalasinabanulu
adanivallane terī āṁḍla miṁte
yedulamāḍalane yiddarini bujjagiṁchĕ
ādumalu danisidi māra ḍiṁka nem̐ṭige
(||nīgu||)
vegiriṁchanem̐ṭige veḍugabaḍevĕlā
bhogamulone terīm̐ dom̐buṭla miṁte
yīgadi śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ ninnu nannum̐ gūḍĕ
bāgugā jokkili mim̐ka palunavvu lem̐ṭige