Neegu naagu neebaadi neyyamu lemdu galave

నీకు నాకు నీపాటి నెయ్యము లెందు గలవె
Language

(॥పల్లవి॥)
నీకు నాకు నీపాటి నెయ్యము లెందు గలవె
కాకుగాఁ జేయ నేలొకో కడ నున్న చెలికి

(॥నీకు॥)
చనవు సేసుక నీతో సారె సారె నవ్వఁగాను
యెన లేనియెగ్గు లెంచీ యీపె నాతోను
వొనర నీ వన్నిటికి నోరుచుక వుండఁగాను
తన కేల వచ్చెనొకో తమక మీచెలికి

(॥నీకు॥)
పొందు సేసుక నిన్ను పువ్వులనె వేయఁగాను
యిందు కే లడ్డాలు వచ్చీ నీపె నాతోను
సందడి నాచేఁత నీకు సమ్మతులై వుండఁగాను
అంది వాదు లింతోలొకో అండ నున్నచెలికి

(॥నీకు॥)
కైవసము సేసుకొని కాఁగిట నిన్ను నించఁగా
యీవల పంత మే లాడీ నీపె నాతోను
చేవదేరఁ గూడితిని శ్రీవెంకటేశ నన్ను
యేవ లేల వచ్చెనొకో యెరవులచెలికి

(||pallavi||)
nīgu nāgu nībāḍi nĕyyamu lĕṁdu galavĕ
kāgugām̐ jeya nelŏgo kaḍa nunna sĕligi

(||nīgu||)
sanavu sesuga nīdo sārĕ sārĕ navvam̐gānu
yĕna leniyĕggu lĕṁchī yībĕ nādonu
vŏnara nī vanniḍigi norusuga vuṁḍam̐gānu
tana kela vachchĕnŏgo tamaga mīsĕligi

(||nīgu||)
pŏṁdu sesuga ninnu puvvulanĕ veyam̐gānu
yiṁdu ke laḍḍālu vachchī nībĕ nādonu
saṁdaḍi nāsem̐ta nīgu sammadulai vuṁḍam̐gānu
aṁdi vādu liṁtolŏgo aṁḍa nunnasĕligi

(||nīgu||)
kaivasamu sesugŏni kām̐giḍa ninnu niṁcham̐gā
yīvala paṁta me lāḍī nībĕ nādonu
sevaderam̐ gūḍidini śhrīvĕṁkaḍeśha nannu
yeva lela vachchĕnŏgo yĕravulasĕligi