Neegu naagegum galade nemdu gottalaa sarasamu

నీకు నాకెకుఁ గలదే నేఁడు గొత్తలా సరసము
Language

(॥పల్లవి॥)
నీకు నాకెకుఁ గలదే నేఁడు గొత్తలా సరసము
కోకొమ్మనీ నదే అందుకొనవయ్య విడెము

(॥నీకు॥)
చనవు గలుగువారు సాదింతురేమైన
ననుపు గలుగువారు నవ్వుదురు
కినియఁగ నేమిటికి కేలెత్తి మొక్కుచు నింతి
వినయాన విన్నవించీ వినవయ్య మాఁట

(॥నీకు॥)
ప్రియము గలుగువారు పెనఁగుదు రెంతైన
క్రియ యెరిఁగినవారు గిలిగింతురు
బయలు బిగియనేల బాఁతిపడి ఆపె నీకు
దయవుట్ట సేవ సేసీ తాళవయ్య చలము

(॥నీకు॥)
బలిమి గలుగువారు పంతాలు నెరపుదురు
వలచినవారు రతి నలయింతురు
యెలమి శ్రీవేంకటేశ యెడమాఁట లిఁకనేల
మెలఁగి కలసె నిన్ను మెచ్చవయ్య యీకెను

(||pallavi||)
nīgu nāgĕgum̐ galade nem̐ḍu gŏttalā sarasamu
kogŏmmanī nade aṁdugŏnavayya viḍĕmu

(||nīgu||)
sanavu galuguvāru sādiṁturemaina
nanubu galuguvāru navvuduru
kiniyam̐ga nemiḍigi kelĕtti mŏkkusu niṁti
vinayāna vinnaviṁchī vinavayya mām̐ṭa

(||nīgu||)
priyamu galuguvāru pĕnam̐gudu rĕṁtaina
kriya yĕrim̐ginavāru giligiṁturu
bayalu bigiyanela bām̐tibaḍi ābĕ nīgu
dayavuṭṭa seva sesī tāḽavayya salamu

(||nīgu||)
balimi galuguvāru paṁtālu nĕrabuduru
valasinavāru radi nalayiṁturu
yĕlami śhrīveṁkaḍeśha yĕḍamām̐ṭa lim̐kanela
mĕlam̐gi kalasĕ ninnu mĕchchavayya yīgĕnu