నీకు నాపెకు నింతేసి నేస్తములు గలిగెను
(॥పల్లవి॥)
నీకు నాపెకు నింతేసి నేస్తములు గలిగెను
దాకొనీ నీకింతేసి తగులా నీకు
(॥నీకు॥)
సెలవుల నవ్వేది చేతులు చాఁచేది
కలికితనా లాపెకుఁ గంటివా వోయి
వలపులు చల్లుతాను వట్టిమాంట లాడుతాను
పిలిచీ నిన్నుఁ జేరఁ బ్రియమా నీకు
(॥నీకు॥)
మోము దప్పక చూచేది ముందట నిలుచుండేది
గామిడితనా లీమెకుఁ గంటివా వోయి
వేమారుఁ గొసరుతాను వేడుకలు చూపుతాను
ప్రేమానఁ జెనకీ నిన్నుఁ బ్రియమా నీకు
(॥నీకు॥)
శిరసు వంచి మొక్కేది సిగ్గులెల్లఁ జూపేది
గరిమ నీపై సొలసీఁ గంటివా వోయి
యిరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
బిరుదులు నాకిచ్చీఁ బ్రియమా నీకు
(||pallavi||)
nīgu nābĕgu niṁtesi nestamulu galigĕnu
dāgŏnī nīgiṁtesi tagulā nīgu
(||nīgu||)
sĕlavula navvedi sedulu sām̐sedi
kaligidanā lābĕgum̐ gaṁṭivā voyi
valabulu salludānu vaṭṭimāṁṭa lāḍudānu
pilisī ninnum̐ jeram̐ briyamā nīgu
(||nīgu||)
momu dappaga sūsedi muṁdaḍa nilusuṁḍedi
gāmiḍidanā līmĕgum̐ gaṁṭivā voyi
vemārum̐ gŏsarudānu veḍugalu sūbudānu
premānam̐ jĕnagī ninnum̐ briyamā nīgu
(||nīgu||)
śhirasu vaṁchi mŏkkedi siggulĕllam̐ jūbedi
garima nībai sŏlasīm̐ gaṁṭivā voyi
yiravai śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
birudulu nāgichchīm̐ briyamā nīgu