Neegu naabe galuguda nee bhaagyame

నీకు నాపె గలుగుట నీ భాగ్యమే
Language

(॥పల్లవి॥)
నీకు నాపె గలుగుట నీ భాగ్యమే
చేకొని కాఁపుర మిట్టె సేయఁగదరయ్యా

(॥నీకు॥)
మగువ నీతోనాడితే మాటలఁ దేనెలు గారీ
నగితే సెలవుల వెన్నెల వెళ్లీని
సగటునఁ బొలసితే బంగారుపొడి చిందీని
మొగి నాపె నురమున మోవఁదగునయ్య

(॥నీకు॥)
తమకించి చూచితేను తామెరరేకులు గప్పీ
చెమరించితే ముత్యాలచేరు లూరీవి
సముకాన నిలిచితే జవ్వనము దొట్టీని
అమరునయ్య నీకంటె నాపెపేరు మునుప

(॥నీకు॥)
యిట్టె కాఁగిలించుకొంటే యిలు నిండీ సిరులెల్ల
మెట్టితే నవరత్నాలు మెండుకొనీని
నెట్టన శ్రీవేంకటేశ నేడు మమ్ము నేలితివి
వొట్టుక యిల్లిటముగా నుండదగువయ్యా

(||pallavi||)
nīgu nābĕ galuguḍa nī bhāgyame
segŏni kām̐pura miṭṭĕ seyam̐gadarayyā

(||nīgu||)
maguva nīdonāḍide māḍalam̐ denĕlu gārī
nagide sĕlavula vĕnnĕla vĕḽlīni
sagaḍunam̐ bŏlaside baṁgārubŏḍi siṁdīni
mŏgi nābĕ nuramuna movam̐dagunayya

(||nīgu||)
tamagiṁchi sūsidenu tāmĕraregulu gappī
sĕmariṁchide mutyālaseru lūrīvi
samugāna niliside javvanamu dŏṭṭīni
amarunayya nīgaṁṭĕ nābĕberu munuba

(||nīgu||)
yiṭṭĕ kām̐giliṁchugŏṁṭe yilu niṁḍī sirulĕlla
mĕṭṭide navaratnālu mĕṁḍugŏnīni
nĕṭṭana śhrīveṁkaḍeśha neḍu mammu nelidivi
vŏṭṭuga yilliḍamugā nuṁḍadaguvayyā