Neegu melaidem jaalu nenu neeloni daanane

నీకు మేలైతేఁ జాలు నేను నీలోని దాననే
Language

(॥పల్లవి॥)
నీకు మేలైతేఁ జాలు నేను నీలోని దాననే
యీకడ నీ వేమన్న నితవయ్యా నాకు

(॥నీకు॥)
బచ్చనకూరిమి చల్లి భ్రమయించేదాననా
పెచ్చురేఁగి యేల ఆన వెట్టు మనేవు
కుచ్చితపు నీగుణము గురుతు గంటిఁగా నేఁడు
చెచ్చెర నీ వేమైనాఁ జెయవయ్య ఇఁకను

(॥నీకు॥)
మాటల మూటలు గట్టి మచ్చు చల్లేదాననా
నాటకాలనుచు నేల నవ్వు నవ్వేవు
మాటుకుఁ బోయి రాఁగా నీమహిమెల్లఁ దెలిసెఁగా
చీటికి వటికి నీచిత్తమయ్య ఇఁకను

(॥నీకు॥)
కన్నుల సన్నలు చేసి కాఁక రేఁచేదాననా
చిన్ననంటా నన్ను నేల చిమ్మిరేఁచేవు
యిన్నిటా శ్రీవేంకటేశ యెరింగి కూడితి విట్టె
మున్నటి నీదయ నాపై ముంచవయ్య ఇంకను

(||pallavi||)
nīgu melaidem̐ jālu nenu nīloni dānane
yīgaḍa nī vemanna nidavayyā nāgu

(||nīgu||)
bachchanagūrimi salli bhramayiṁchedānanā
pĕchchurem̐gi yela āna vĕṭṭu manevu
kuchchidabu nīguṇamu gurudu gaṁṭim̐gā nem̐ḍu
sĕchchĕra nī vemainām̐ jĕyavayya im̐kanu

(||nīgu||)
māḍala mūḍalu gaṭṭi machchu salledānanā
nāḍagālanusu nela navvu navvevu
māḍugum̐ boyi rām̐gā nīmahimĕllam̐ dĕlisĕm̐gā
sīḍigi vaḍigi nīsittamayya im̐kanu

(||nīgu||)
kannula sannalu sesi kām̐ka rem̐sedānanā
sinnanaṁṭā nannu nela simmirem̐sevu
yinniḍā śhrīveṁkaḍeśha yĕriṁgi kūḍidi viṭṭĕ
munnaḍi nīdaya nābai muṁchavayya iṁkanu