Neegu devulanu nenu neramemchenaa

నీకు దేవులను నేను నేరమెంచేనా
Language

(॥పల్లవి॥)
నీకు దేవులను నేను నేరమెంచేనా
పైకొని నాయంత వచ్చి బలిమిచూపేనా

(॥నీకు॥)
పక్కున నాతో నీవు పంతములు నెరపినా
నిక్కినిక్కి చూతుఁగాక నిన్నుదూరెనా
వెక్కసపుసతులను వేవేలు దెచ్చినాను
మొక్కులే మొక్కుదుఁగాక ముంచి కోపించేనా

(॥నీకు॥)
ఆరడిఁబెట్టి నన్నెంత అట్టె మాటలాడినాను
తేరకొనఁ జూతుఁగాక తిట్టు దిట్టేనా
బీరాన మాతో నెంత పెనఁగులాట లాడిన
చేం పొగడుదుఁగాక చిక్కులఁ బెట్టేనా

(॥నీకు॥)
గచ్చులకు నన్ను నెంత కాఁగిట బిగించినాను
పెచ్చువెనఁగుదుఁగాక పిరితీసేనా
ఇచ్చట శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
మచ్చికైవుందుఁగాక మఱచేనా మేలు

(||pallavi||)
nīgu devulanu nenu neramĕṁchenā
paigŏni nāyaṁta vachchi balimisūbenā

(||nīgu||)
pakkuna nādo nīvu paṁtamulu nĕrabinā
nikkinikki sūdum̐gāga ninnudūrĕnā
vĕkkasabusadulanu vevelu dĕchchinānu
mŏkkule mŏkkudum̐gāga muṁchi kobiṁchenā

(||nīgu||)
āraḍim̐bĕṭṭi nannĕṁta aṭṭĕ māḍalāḍinānu
teragŏnam̐ jūdum̐gāga tiṭṭu diṭṭenā
bīrāna mādo nĕṁta pĕnam̐gulāḍa lāḍina
seṁ pŏgaḍudum̐gāga sikkulam̐ bĕṭṭenā

(||nīgu||)
gachchulagu nannu nĕṁta kām̐giḍa bigiṁchinānu
pĕchchuvĕnam̐gudum̐gāga piridīsenā
ichchaḍa śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
machchigaivuṁdum̐gāga maṟasenā melu