నీకు బాఁతి గాక ఆకె నేరుపులు మాకు బాఁతె
(॥పల్లవి॥)
నీకు బాఁతి గాక ఆకె నేరుపులు మాకు బాఁతె
దాకొని యా సుద్ది నీతోఁ దడవ వచ్చితిమా
(॥నీకు॥)
అంత బత్తిగలవాఁడ వాకె నింటికిఁ గొంపోయి
చెంత నెత్తిఁ బెట్టుక పూజించ రాదా
యెంత లే దాపె మాఁటలే యీడఁ జెల్ల బెట్ట వచ్చే
వంతలో సాకిరి నిన్ను నడుగ వచ్చితిమా
(॥నీకు॥)
మించి నీ వాపెకుఁ గడు మేలువాఁడ వైతేను
యెంచి నీ మేనిలో సగ మియ్య రాదా
మంచి దంటా నాపె నీడ మంతనానఁ బొగడేవు
యించుక కైనాఁ దేగ మియ్యఁగ వచ్చితిమా
(॥నీకు॥)
తిరముగ నాపెఁ గొని తెచ్చుకొన్నవాఁడ వైతే
యిర వై నీ గద్దెమీఁద నెక్కించ రాదా
వొరిమి శ్రీవెంకటేశ వురముపై నే నుందాన
సిరసు వంచేవు నీకు సిగ్గులు రేఁచితమా
(||pallavi||)
nīgu bām̐ti gāga āgĕ nerubulu māgu bām̐tĕ
dāgŏni yā suddi nīdom̐ daḍava vachchidimā
(||nīgu||)
aṁta battigalavām̐ḍa vāgĕ niṁṭigim̐ gŏṁpoyi
sĕṁta nĕttim̐ bĕṭṭuga pūjiṁcha rādā
yĕṁta le dābĕ mām̐ṭale yīḍam̐ jĕlla bĕṭṭa vachche
vaṁtalo sāgiri ninnu naḍuga vachchidimā
(||nīgu||)
miṁchi nī vābĕgum̐ gaḍu meluvām̐ḍa vaidenu
yĕṁchi nī menilo saga miyya rādā
maṁchi daṁṭā nābĕ nīḍa maṁtanānam̐ bŏgaḍevu
yiṁchuga kainām̐ dega miyyam̐ga vachchidimā
(||nīgu||)
tiramuga nābĕm̐ gŏni tĕchchugŏnnavām̐ḍa vaide
yira vai nī gaddĕmīm̐da nĕkkiṁcha rādā
vŏrimi śhrīvĕṁkaḍeśha vuramubai ne nuṁdāna
sirasu vaṁchevu nīgu siggulu rem̐sidamā