Neegu baamtai neemumdara nilusunnadi

నీకు బాఁతై నీముందర నిలుచున్నది
Language

(॥పల్లవి॥)
నీకు బాఁతై నీముందర నిలుచున్నది
దాకొని నిన్నెటువలెఁ దగిలీనో కాని

(॥॥)
చెలరేఁగి చెలరేఁగి సేవలు సేసీ నాపె
వలచి తానెందుండి వచ్చెనో కాని
వెలలేని సింగారాల వింత మొగము దాపె
కలయ నెన్నాళ్ళనుండి కలిగెనో కాని

(॥॥)
నిట్టచూపులతోడ నీ మొగము చూచీ నాపె
వొట్టి నీవేవూరో తానేవూరో కాని
బట్టబయలు నీతోను పై కొని నవ్వీ నాపె
చుట్టరికము నీకుఁ దా నెట్టాయనో కాని

(॥॥)
పొంచి నీవద్దఁ గూచుండి పువ్వులు ముడిచీ నాపె
అంచెలఁదా నెన్నఁడు పెండ్లాడెనో కాని
యెంచఁగ నన్ను శ్రీ వేంకటేశ నేఁడు గూడితివి
పంచలపాలై తానేల పదరీనో కాని

(||pallavi||)
nīgu bām̐tai nīmuṁdara nilusunnadi
dāgŏni ninnĕḍuvalĕm̐ dagilīno kāni

(||||)
sĕlarem̐gi sĕlarem̐gi sevalu sesī nābĕ
valasi tānĕṁduṁḍi vachchĕno kāni
vĕlaleni siṁgārāla viṁta mŏgamu dābĕ
kalaya nĕnnāḽḽanuṁḍi kaligĕno kāni

(||||)
niṭṭasūbuladoḍa nī mŏgamu sūsī nābĕ
vŏṭṭi nīvevūro tānevūro kāni
baṭṭabayalu nīdonu pai kŏni navvī nābĕ
suṭṭarigamu nīgum̐ dā nĕṭṭāyano kāni

(||||)
pŏṁchi nīvaddam̐ gūsuṁḍi puvvulu muḍisī nābĕ
aṁchĕlam̐dā nĕnnam̐ḍu pĕṁḍlāḍĕno kāni
yĕṁcham̐ga nannu śhrī veṁkaḍeśha nem̐ḍu gūḍidivi
paṁchalabālai tānela padarīno kāni