నీకూ నీపెకుఁ దగును నేరుపు లెంచి చూచితే
(॥పల్లవి॥)
నీకూ నీపెకుఁ దగును నేరుపు లెంచి చూచితే
చేకొని మెచ్చరయ్యా యీ చెలియ సాబగులు
(॥నీకూ॥)
చక్కెర మోవిఁ దొలఁక సారెసారె మాటలాడీ
జక్కవచన్నులు చూపి చల్లీవలపు
రెక్కతుమ్మిద విరుల రేఁచిరేఁచి కొప్పవెట్టీ
చక్కఁజూడవయ్య యీసకియ పగటులు
(॥నీకూ॥)
సిగ్గులు సెలవిఁ బార చిరునవ్వు నవ్వీని
నిగ్గులు మేన నిండ నీతోఁ బెనఁగీ
వెగ్గళించి చూపులనే వెన్నెలలు వెదవెట్టీ
వొగ్గి చిత్తగించవయ్యా వువిద నటనలు
(॥నీకూ॥)
జోకలు కాఁగిటఁ దేర చుట్టరికము చెప్పీని
మేకులు మురిపెమున మెరఇంచీని
యాకెను శ్రీవేంకటేశ యేలితివి నన్ను మెచ్చి
మేకొనవయ్యా అలమేలుమంగ రతులు
(||pallavi||)
nīgū nībĕgum̐ dagunu nerubu lĕṁchi sūside
segŏni mĕchcharayyā yī sĕliya sābagulu
(||nīgū||)
sakkĕra movim̐ dŏlam̐ka sārĕsārĕ māḍalāḍī
jakkavasannulu sūbi sallīvalabu
rĕkkadummida virula rem̐sirem̐si kŏppavĕṭṭī
sakkam̐jūḍavayya yīsagiya pagaḍulu
(||nīgū||)
siggulu sĕlavim̐ bāra sirunavvu navvīni
niggulu mena niṁḍa nīdom̐ bĕnam̐gī
vĕggaḽiṁchi sūbulane vĕnnĕlalu vĕdavĕṭṭī
vŏggi sittagiṁchavayyā vuvida naḍanalu
(||nīgū||)
jogalu kām̐giḍam̐ dera suṭṭarigamu sĕppīni
megulu muribĕmuna mĕra̮iṁchīni
yāgĕnu śhrīveṁkaḍeśha yelidivi nannu mĕchchi
megŏnavayyā alamelumaṁga radulu