(॥పల్లవి॥)
నీకొలఁదివారమా నేమెల్లాను
కైకొని యీ పనులకె కాచుకున్నవారము
(॥నీకొ॥)
సారెఁ గొప్పు దువ్వుతాను చన్నులనొత్తీ నాపె
ఆరీతి నందె పరాకైనాఁ డితఁడు
చేరి విన్నపా లేమిసేసేవే విభునికి
నేరిచి మాటాడించితే నీవేపో సతివి
(॥నీకొ॥)
పరిమళము(ము?) లందుతా పైఁదొడవేసీ నాపె
కరఁగీఁ జెమటల గక్కన నాతఁడు
యెరవుల యాతనికి యేమివిడెమిచ్చేవే
మరగించుకొంటేను మరి నీవే సతివి
(॥నీకొ॥)
సొమ్ములెట్టుత నెనసెఁ జొక్కి యలమేలుమంగ
పమ్మి శ్రీవేంకటేశుఁడు భ్రమసినాఁడు
యిమ్ముల మనల నేలె యింతలో నేమిమొక్కేవే
యెమ్మెలునెరపకుంటే యింక నీవే సతివి
(||pallavi||)
nīgŏlam̐divāramā nemĕllānu
kaigŏni yī panulagĕ kāsugunnavāramu
(||nīgŏ||)
sārĕm̐ gŏppu duvvudānu sannulanŏttī nābĕ
ārīdi naṁdĕ parāgainām̐ ḍidam̐ḍu
seri vinnabā lemiseseve vibhunigi
nerisi māḍāḍiṁchide nīvebo sadivi
(||nīgŏ||)
parimaḽamu(mu?) laṁdudā paim̐dŏḍavesī nābĕ
karam̐gīm̐ jĕmaḍala gakkana nādam̐ḍu
yĕravula yādanigi yemiviḍĕmichcheve
maragiṁchugŏṁṭenu mari nīve sadivi
(||nīgŏ||)
sŏmmulĕṭṭuda nĕnasĕm̐ jŏkki yalamelumaṁga
pammi śhrīveṁkaḍeśhum̐ḍu bhramasinām̐ḍu
yimmula manala nelĕ yiṁtalo nemimŏkkeve
yĕmmĕlunĕrabaguṁṭe yiṁka nīve sadivi