Neegolamdivaaramaa nemellaanu

నీకొలఁదివారమా నేమెల్లాను
Language

(॥పల్లవి॥)
నీకొలఁదివారమా నేమెల్లాను
కాకుసేయఁజాలక కనుఁగొనేఁగాక

(॥నీకొ॥)
పంత మేమినెరపేవే పగటేమి చూపేవే
కొంతైనా సిబ్బితిలేక కొలువులోన
వంతుకేల పెనఁగేవే వట్టి వారితో నీవు
ఇంతటినాయకుఁడు నిన్నేమీ ననఁడంటాను

(॥నీకొ॥)
వేసా లేలసేసేవే వెగటేల సలిపేవే
వాసులేమీ నెంచక వనితలతో
తోసుకేల వచ్చేవే తోడివూడిగపువారి
యీసేఁత లాతఁడు చూచి యేమీ ననఁడంటాను

(॥నీకొ॥)
సెలవినేల నవ్వేవే సిగ్గులేల పెంచేవే
తలఁపేమీ నెఱఁగనితగువారిలో
అలమేలుమంగపతియుగుశ్రీవేంకటేశుఁడు
యిల నన్నేలె నిన్నా తఁడేమీ ననఁడటాఁను

(||pallavi||)
nīgŏlam̐divāramā nemĕllānu
kāguseyam̐jālaga kanum̐gŏnem̐gāga

(||nīgŏ||)
paṁta meminĕrabeve pagaḍemi sūbeve
kŏṁtainā sibbidilega kŏluvulona
vaṁtugela pĕnam̐geve vaṭṭi vārido nīvu
iṁtaḍināyagum̐ḍu ninnemī nanam̐ḍaṁṭānu

(||nīgŏ||)
vesā lelaseseve vĕgaḍela salibeve
vāsulemī nĕṁchaga vanidalado
tosugela vachcheve toḍivūḍigabuvāri
yīsem̐ta lādam̐ḍu sūsi yemī nanam̐ḍaṁṭānu

(||nīgŏ||)
sĕlavinela navveve siggulela pĕṁcheve
talam̐pemī nĕṟam̐ganidaguvārilo
alamelumaṁgabadiyuguśhrīveṁkaḍeśhum̐ḍu
yila nannelĕ ninnā tam̐ḍemī nanam̐ḍaḍām̐nu