Neegolamdidaananaa ne ninnidaa

నీకొలఁదిదాననా నే నిన్నిటా
Language

(॥పల్లవి॥)
నీకొలఁదిదాననా నే నిన్నిటా
జోకలెల్లా మీఁదమీఁదఁ జూడరాదా యిఁకను

(॥॥)
నవ్వులెన్ని నవ్వేవే నయ మెంతచూపేవే
రవ్వలుగా వలచిరమణునికి
యివ్వల నీతని నేఁడే యింటికి రప్పించుకొంటే
చివ్వన నీవు నన్ను మెచ్చేవటవే యిపుడు

(॥॥)
పంతమెంతనెరుపేవే పనులెన్ని చెప్పేవే
వింతలుగాఁ జొక్కినట్టివిభునికిని
చెంతనుండి నేను నట్టే చేతికి లోఁ జేసుకొంటే
సంతసించి పొగడేవా సారెసారె నన్నును

(॥॥)
చవులెన్ని చూపేవే చనవెంత నెరుపేవే
యివలను శ్రీ వేంకటేశ్వరునికి
జవళి నితని నేను సంగడిఁ బెండ్లాడితి
వివరానఁ బందెమువేయరాదా యిందుకు

(||pallavi||)
nīgŏlam̐didānanā ne ninniḍā
jogalĕllā mīm̐damīm̐dam̐ jūḍarādā yim̐kanu

(||||)
navvulĕnni navveve naya mĕṁtasūbeve
ravvalugā valasiramaṇunigi
yivvala nīdani nem̐ḍe yiṁṭigi rappiṁchugŏṁṭe
sivvana nīvu nannu mĕchchevaḍave yibuḍu

(||||)
paṁtamĕṁtanĕrubeve panulĕnni sĕppeve
viṁtalugām̐ jŏkkinaṭṭivibhunigini
sĕṁtanuṁḍi nenu naṭṭe sedigi lom̐ jesugŏṁṭe
saṁtasiṁchi pŏgaḍevā sārĕsārĕ nannunu

(||||)
savulĕnni sūbeve sanavĕṁta nĕrubeve
yivalanu śhrī veṁkaḍeśhvarunigi
javaḽi nidani nenu saṁgaḍim̐ bĕṁḍlāḍidi
vivarānam̐ baṁdĕmuveyarādā yiṁdugu