నీకింత యేలె వెఱపు నీకు మగఁ డాతఁడు
(॥పల్లవి॥)
నీకింత యేలె వెఱపు నీకు మగఁ డాతఁడు
చేకొని నీ చనవెల్లాఁ జెల్లించుకోరాదా
(॥నీకిం॥)
చీటికి మాటికి నీవు సిగ్గులు వడేవుగాని
నాటుకొనఁ బతితోను నగరాదా
కూటమి గోరి సంగడిఁ గూచుండ లోఁగేవుగాని
వోటలేక కుచముల నొరయ రాదా
(॥నీకిం॥)
చనవులా మనవులాసాదించవచ్చేవుగాని
మనసిచ్చి యాతనితో మాటాడరాదా
తనియక మోవి చూచి దప్పులు దేరేవుగాని
వినయానఁ దములము వేఁడుకోరాదా
(॥నీకిం॥)
అలపులా సొలపులా ఆయాలు ముట్టేవుగాని
పిలిచి శ్రీవేంకటేశుఁ బెండ్లాడరాదా
బలిమి నన్నిటా నొడఁబరచుకొంటివిగాని
మలసి రతుల నిట్టె మన్నించుకోరాదా
(||pallavi||)
nīgiṁta yelĕ vĕṟabu nīgu magam̐ ḍādam̐ḍu
segŏni nī sanavĕllām̐ jĕlliṁchugorādā
(||nīgiṁ||)
sīḍigi māḍigi nīvu siggulu vaḍevugāni
nāḍugŏnam̐ badidonu nagarādā
kūḍami gori saṁgaḍim̐ gūsuṁḍa lom̐gevugāni
voḍalega kusamula nŏraya rādā
(||nīgiṁ||)
sanavulā manavulāsādiṁchavachchevugāni
manasichchi yādanido māḍāḍarādā
taniyaga movi sūsi dappulu derevugāni
vinayānam̐ damulamu vem̐ḍugorādā
(||nīgiṁ||)
alabulā sŏlabulā āyālu muṭṭevugāni
pilisi śhrīveṁkaḍeśhum̐ bĕṁḍlāḍarādā
balimi nanniḍā nŏḍam̐barasugŏṁṭivigāni
malasi radula niṭṭĕ manniṁchugorādā