నీకింత బాఁతైతిఁగా నేఁ జేసినదే భాగ్యము
(॥పల్లవి॥)
నీకింత బాఁతైతిఁగా నేఁ జేసినదే భాగ్యము
కైకొనవయ్యా పాదాలు గడిగే నే నీకును
(॥నీకింత॥)
వేడుక కొకమాఁట వెలఁదిచేఁ జెప్పిపంపి
వాడికల కిందాఁకా వచ్చితివేమో
యాడవారితోడ పొందు యెంతగద్దు అయినాఁగాని
వీడె మందుకోవయ్యా వీచ్చేసితి వీడకు
(॥నీకింత॥)
చనవిచ్చినటువలె సారెకుఁ దప్పక చూచి
మనసు సోదించ మాతో మాఁటాడేవేమో
చనకిన్నాళ్ళు సరకు సేతువా నేఁ డేమికొత్తో
ఘనతఁ గూచుండవయ్యా గద్దెపీఁట మీఁదను
(॥నీకింత॥)
సమ్మతి నోవరిలోన సరుస నన్నుఁ బెట్టుక
నమ్మికగా నాతోడ నవ్వేవేమో
యిమ్ముల శ్రీవేంకటేశ యెనసితి వందుకేమి
పమ్మి నీకుఁ జేత మొక్కే బాయకుండవయ్యా
(||pallavi||)
nīgiṁta bām̐taidim̐gā nem̐ jesinade bhāgyamu
kaigŏnavayyā pādālu gaḍige ne nīgunu
(||nīgiṁta||)
veḍuga kŏgamām̐ṭa vĕlam̐disem̐ jĕppibaṁpi
vāḍigala kiṁdām̐kā vachchidivemo
yāḍavāridoḍa pŏṁdu yĕṁtagaddu ayinām̐gāni
vīḍĕ maṁdugovayyā vīchchesidi vīḍagu
(||nīgiṁta||)
sanavichchinaḍuvalĕ sārĕgum̐ dappaga sūsi
manasu sodiṁcha mādo mām̐ṭāḍevemo
sanaginnāḽḽu saragu seduvā nem̐ ḍemigŏtto
ghanadam̐ gūsuṁḍavayyā gaddĕbīm̐ṭa mīm̐danu
(||nīgiṁta||)
sammadi novarilona sarusa nannum̐ bĕṭṭuga
nammigagā nādoḍa navvevemo
yimmula śhrīveṁkaḍeśha yĕnasidi vaṁdugemi
pammi nīgum̐ jeda mŏkke bāyaguṁḍavayyā