Neegetlidavaayano ne neraganu

నీకెట్లితవాయనో నే నెరగను
Language

(॥పల్లవి॥)
నీకెట్లితవాయనో నే నెరగను
ఆ కడ నిన్నాడుకోఁగా నరుదాయ నాకు

(॥నీకె॥)
కొత్తగా వేరొకసతి కొంగు నిన్నుఁ బట్టఁగాను
చిత్తమెల్లా నీరాయ సిగ్గున నాకు
వొత్తి యటమీఁద నీకు నొట్లెల్లాఁ బెట్టగాను
మత్తిలి కోపము రేఁగె మచ్చరాన నాకు

(॥నీకె॥)
దాయక పాయక నిన్నుఁ దగవుకుఁ బిలువఁగా
కాయమెల్లాఁ జెమరించె కాఁకల నాకు
చేయిచాఁచి చేయరాని సేఁతలెల్లాఁ జేయఁగాను
చాయల పంతములెక్కె సముకాన నాకు

(॥నీకె॥)
అవ్వల నిన్నాకె గూడె అట్టె నన్నుఁ గూడితివి
నవ్వులు సెలవిఁ దేరె నంటున నాకు
దవ్వులనుండే తాను తమకము రేఁచఁగాను
చివ్వన శ్రీవేంకటేశ చిమ్మిరేఁగె నాకు

(||pallavi||)
nīgĕṭlidavāyano ne nĕraganu
ā kaḍa ninnāḍugom̐gā narudāya nāgu

(||nīgĕ||)
kŏttagā verŏgasadi kŏṁgu ninnum̐ baṭṭam̐gānu
sittamĕllā nīrāya sigguna nāgu
vŏtti yaḍamīm̐da nīgu nŏṭlĕllām̐ bĕṭṭagānu
mattili kobamu rem̐gĕ machcharāna nāgu

(||nīgĕ||)
dāyaga pāyaga ninnum̐ dagavugum̐ biluvam̐gā
kāyamĕllām̐ jĕmariṁchĕ kām̐kala nāgu
seyisām̐si seyarāni sem̐talĕllām̐ jeyam̐gānu
sāyala paṁtamulĕkkĕ samugāna nāgu

(||nīgĕ||)
avvala ninnāgĕ gūḍĕ aṭṭĕ nannum̐ gūḍidivi
navvulu sĕlavim̐ derĕ naṁṭuna nāgu
davvulanuṁḍe tānu tamagamu rem̐sam̐gānu
sivvana śhrīveṁkaḍeśha simmirem̐gĕ nāgu