నీకెప్పుడూ నీ వోజ నాకైతే నా వోజ
(॥పల్లవి॥)
నీకెప్పుడూ నీ వోజ నాకైతే నా వోజ
చేకొని యీరెండూను చెల్లు నిదే మనకు
(॥నీకె॥)
యేమగువలమాట కెంత నీవు లోనైనా
నీమాటలోనిదాన నే నెప్పుడు
చేముట్టి నీ వెవ్వరిచేఁ జెనకించుకొనినాను
ఆముక నీచేతికి లోనైనదాన నేను
(॥నీకె॥)
నంటున నేయింతులతోనవ్వులు నీవు నవ్వినా
గొంటరి నీనవ్వులకు గురి నేను
ఇంటింట నీవెవ్వరికి యిచ్చకములు సేసినా
జంటైనని కిచ్చకము జరపుదు నేను
(॥నీకె॥)
కందువ నీ వేసతులకాఁగి కాసపడినా
అంది నాయాసలు నీపై నంటింతును
ఇందరి శ్రీ వేంకటేశ యెనసి నన్నేలితివి
పొందుసేసి నీతోను భోగించితి నేను
(||pallavi||)
nīgĕppuḍū nī voja nāgaide nā voja
segŏni yīrĕṁḍūnu sĕllu nide managu
(||nīgĕ||)
yemaguvalamāḍa kĕṁta nīvu lonainā
nīmāḍalonidāna ne nĕppuḍu
semuṭṭi nī vĕvvarisem̐ jĕnagiṁchugŏninānu
āmuga nīsedigi lonainadāna nenu
(||nīgĕ||)
naṁṭuna neyiṁtuladonavvulu nīvu navvinā
gŏṁṭari nīnavvulagu guri nenu
iṁṭiṁṭa nīvĕvvarigi yichchagamulu sesinā
jaṁṭainani kichchagamu jarabudu nenu
(||nīgĕ||)
kaṁduva nī vesadulagām̐gi kāsabaḍinā
aṁdi nāyāsalu nībai naṁṭiṁtunu
iṁdari śhrī veṁkaḍeśha yĕnasi nannelidivi
pŏṁdusesi nīdonu bhogiṁchidi nenu