Neegemta veduga gaddo nemoom joosemugaaga

నీకెంత వేడుక గద్దో నేమూఁ జూచేముగాక
Language

(॥పల్లవి॥)
నీకెంత వేడుక గద్దో నేమూఁ జూచేముగాక
కాకుసేయవచ్చునా కడలవారికిని

(॥నీకెం॥)
వలెనని యాతనికి వాడిక నీవు చూపఁగా
వలదనవచ్చునా వాడవారికి
చలపట్టి యప్పటిని సలిగెలు నెరపఁగా
పొలసులాడవచ్చునా పొరుగువారికిని

(॥నీకెం॥)
చిప్పిల నీవాతనితోఁ జేఁతలెల్లాఁ జేయఁగాను
వుప్పటించవచ్చునా వూరివారికి
చొప్పుఁగ బతి మొగము చూచి నీవు నవ్వఁగాను
తప్పులెంచవచ్చునా దండనున్నవారికి

(॥నీకెం॥)
గారవించి నీవూఁ దానుఁ గాఁగిలించుకొనఁగాను
వారించఁగవచ్చునా సవతివారికి
యీరీతి శ్రీవేంకటేశుఁ డేలె నన్ను నంతలోనె
వేరుసేయవచ్చునా వింతవారికి

(||pallavi||)
nīgĕṁta veḍuga gaddo nemūm̐ jūsemugāga
kāguseyavachchunā kaḍalavārigini

(||nīgĕṁ||)
valĕnani yādanigi vāḍiga nīvu sūbam̐gā
valadanavachchunā vāḍavārigi
salabaṭṭi yappaḍini saligĕlu nĕrabam̐gā
pŏlasulāḍavachchunā pŏruguvārigini

(||nīgĕṁ||)
sippila nīvādanidom̐ jem̐talĕllām̐ jeyam̐gānu
vuppaḍiṁchavachchunā vūrivārigi
sŏppum̐ga badi mŏgamu sūsi nīvu navvam̐gānu
tappulĕṁchavachchunā daṁḍanunnavārigi

(||nīgĕṁ||)
gāraviṁchi nīvūm̐ dānum̐ gām̐giliṁchugŏnam̐gānu
vāriṁcham̐gavachchunā savadivārigi
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu naṁtalonĕ
veruseyavachchunā viṁtavārigi