నీకేమిటికే గడమ నీకొఱకు నింత యేల
(॥పల్లవి॥)
నీకేమిటికే గడమ నీకొఱకు నింత యేల
కైకొన్న నీ దాసులకే గడించేవు దేవుఁడ
(॥నీకే॥)
బ్రతుకేటి బ్రతుకెల్ల పై పై నాలుబిడ్డలకే
గతిగా సంసారులు గడియింతురు
యితవై జగత్తు లెల్ల యేలెడివిధ మెల్ల
తతి నీదాసులకేతలఁ పెల్ల దేవుఁడ
(॥నీకే॥)
యెదుటనే తమరాజ్య మెక్కుడుగా నేలుటెల్ల
పదపడి తొత్తులకు బంట్లకేకా
పొదిగి లక్ష్మీపతివై భూపతివై యుండుటెల్ల
కొదలేని నీ దాసులకొఱకే దేవుఁడా
(॥నీకే॥)
బలిమిఁ గైదువ వట్టి పదిలమై కాచే దెల్ల
యిలఁ దనవారు సుఖియించుటకే కా
లలి చక్రమువట్టిన లావు లెల్లా నీ దాసులు
వెలసేటి కొఱకు శ్రీ వేంకటాద్రిదేవుఁడ
(||pallavi||)
nīgemiḍige gaḍama nīgŏṟagu niṁta yela
kaigŏnna nī dāsulage gaḍiṁchevu devum̐ḍa
(||nīge||)
bradugeḍi bradugĕlla pai pai nālubiḍḍalage
gadigā saṁsārulu gaḍiyiṁturu
yidavai jagattu lĕlla yelĕḍividha mĕlla
tadi nīdāsulagedalam̐ pĕlla devum̐ḍa
(||nīge||)
yĕduḍane tamarājya mĕkkuḍugā neluḍĕlla
padabaḍi tŏttulagu baṁṭlagegā
pŏdigi lakṣhmībadivai bhūbadivai yuṁḍuḍĕlla
kŏdaleni nī dāsulagŏṟage devum̐ḍā
(||nīge||)
balimim̐ gaiduva vaṭṭi padilamai kāse dĕlla
yilam̐ danavāru sukhiyiṁchuḍage kā
lali sakramuvaṭṭina lāvu lĕllā nī dāsulu
vĕlaseḍi kŏṟagu śhrī veṁkaḍādridevum̐ḍa