Neegemi galiginaanu nemmi nadi naa laabamu

నీకేమి గలిగినాను నెమ్మి నది నా లాబము
Language

(॥పల్లవి॥)
నీకేమి గలిగినాను నెమ్మి నది నా లాబము
జోకగా నానతీవయ్యా సొంపుగా వినేను

(॥నీకే॥)
చెక్కులమీఁదట నవే చెమటలూ। నీ
చక్కని మోమున నవే చంద్రకళలు
యెక్కడఁ గలిగెనయ్య యింతేసి
నిక్కము చెప్పఁగరాదా నేనూ వినేను

(॥నీకే॥)
సెలవుల నవిగో చిఱునవ్వులూ నీ
తలిరుమోవిని నిండె తగుకెంపులు
యెలమి నీకె యవరె నీకొత్తలు
నెలకొని చెప్పరాదా నేనూ వినేను

(॥నీకే॥)
తొరలె నీనొసల లత్తుకచిన్నలూ నీ
విరవయిన శ్రీవేంకటేశుఁడవు
వురాన నలమేల్ మంగ నున్నదానను
నిరతితోఁ జెప్పరాదా నేనూ వినేను

(||pallavi||)
nīgemi galiginānu nĕmmi nadi nā lābamu
jogagā nānadīvayyā sŏṁpugā vinenu

(||nīge||)
sĕkkulamīm̐daḍa nave sĕmaḍalū| nī
sakkani momuna nave saṁdragaḽalu
yĕkkaḍam̐ galigĕnayya yiṁtesi
nikkamu sĕppam̐garādā nenū vinenu

(||nīge||)
sĕlavula navigo siṟunavvulū nī
talirumovini niṁḍĕ tagugĕṁpulu
yĕlami nīgĕ yavarĕ nīgŏttalu
nĕlagŏni sĕpparādā nenū vinenu

(||nīge||)
tŏralĕ nīnŏsala lattugasinnalū nī
viravayina śhrīveṁkaḍeśhum̐ḍavu
vurāna nalamel maṁga nunnadānanu
niradidom̐ jĕpparādā nenū vinenu