Neegele veṟabu nemdu savadulam joosi

నీకేలే వెఱపు నేఁడు సవతులఁ జూచి
Language

(॥పల్లవి॥)
నీకేలే వెఱపు నేఁడు సవతులఁ జూచి
కైకొని కన్న వారిదే కంటి గురుమ గాదా

(॥నీకే॥)
నిలుచున్నాఁ డదివో నీయెదుట రమణుఁడు
పిలిచి పీఁటవెట్టవే ప్రియురాలవు
తొలుతనే యాతఁడు పొత్తులమగఁడైతే నేమి
వలచిన వారిదే వలపింతే కాక

(॥నీకే॥)
మాటలాడీ నదివో మనసిచ్చి అతఁడు
పాటించి వొఁకొనవే పలుమారును
కూటమికి తావచ్చి గుట్టున నుంటే నేమే
వాటమైనచోటికి మచ్చుఁగదే నీరు

(॥నీకే॥)
చేరవచ్చె నదివో శ్రీవేంకటేశ్వరుఁడు
గారవించి కాఁగిటఁ గలయఁగదే
వారకపురతిఁ బరవళ మీకఁడై తేనేమే
తారుకాణయినచోట తమిరేఁచుఁగదవే

(||pallavi||)
nīgele vĕṟabu nem̐ḍu savadulam̐ jūsi
kaigŏni kanna vāride kaṁṭi guruma gādā

(||nīge||)
nilusunnām̐ ḍadivo nīyĕduḍa ramaṇum̐ḍu
pilisi pīm̐ṭavĕṭṭave priyurālavu
tŏludane yādam̐ḍu pŏttulamagam̐ḍaide nemi
valasina vāride valabiṁte kāga

(||nīge||)
māḍalāḍī nadivo manasichchi adam̐ḍu
pāḍiṁchi vŏm̐kŏnave palumārunu
kūḍamigi tāvachchi guṭṭuna nuṁṭe neme
vāḍamainasoḍigi machchum̐gade nīru

(||nīge||)
seravachchĕ nadivo śhrīveṁkaḍeśhvarum̐ḍu
gāraviṁchi kām̐giḍam̐ galayam̐gade
vāragaburadim̐ baravaḽa mīgam̐ḍai teneme
tārugāṇayinasoḍa tamirem̐sum̐gadave