నీకేలే మాగొడవ నీయంత నుందువుగాక
(॥పల్లవి॥)
నీకేలే మాగొడవ నీయంత నుందువుగాక
ఆ కొలఁది కాకొలఁది అయ్యీఁగాక
(॥నీకే॥)
చొక్కపునీ మోము చూచేచూపులకు నడ్డమా
చెక్కుకుఁ జేయడ్డమైతేఁ జెల్లెఁగాక
యిక్కువ సెలవినవ్వు లిందులోనాఁ గొంచెమా
నిక్కి నడుము కొంచెము నీకుఁ జెల్లుఁగాక
(॥నీకే॥)
మాటలాడేయందుకు మఱఁగా నీగుబ్బలకు
మాఁటు పయ్యదైతే నమరుఁగాక
కూటమి నామనసుకు గుఱుతా నీకొనగోరు
కోటిచంద్రవంకలకు గుఱుతింతేకాక
(॥నీకే॥)
చిమ్మురతికాఁగిటికి సిగ్గులా నీలోలోనే
వుమ్మగిలి వొకచోటి కొదుగుఁగాక
తెమ్మగా శ్రీవేంకటాద్రిదేవుఁడ నేఁ గూడితిని
వమ్మువోనినీకుఁ బరవశములేకాక
(||pallavi||)
nīgele māgŏḍava nīyaṁta nuṁduvugāga
ā kŏlam̐di kāgŏlam̐di ayyīm̐gāga
(||nīge||)
sŏkkabunī momu sūsesūbulagu naḍḍamā
sĕkkugum̐ jeyaḍḍamaidem̐ jĕllĕm̐gāga
yikkuva sĕlavinavvu liṁdulonām̐ gŏṁchĕmā
nikki naḍumu kŏṁchĕmu nīgum̐ jĕllum̐gāga
(||nīge||)
māḍalāḍeyaṁdugu maṟam̐gā nīgubbalagu
mām̐ṭu payyadaide namarum̐gāga
kūḍami nāmanasugu guṟudā nīgŏnagoru
koḍisaṁdravaṁkalagu guṟudiṁtegāga
(||nīge||)
simmuradigām̐giḍigi siggulā nīlolone
vummagili vŏgasoḍi kŏdugum̐gāga
tĕmmagā śhrīveṁkaḍādridevum̐ḍa nem̐ gūḍidini
vammuvoninīgum̐ baravaśhamulegāga